Daaku Maharaj.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు అందుకున్నారు బాలకృష్ణ(Balakrishna) ఒకవైపు సినిమాలతో వరుస హ్యాట్రిక్ లు అందుకుంటూ.. మరొకవైపు రాజకీయాలలో కూడా వరుస విజయాలు సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అందుకే ఇటు సినిమాల పరంగా అటు రాజకీయపరంగా నెంబర్వన్ స్థానాన్ని దక్కించుకున్నారు అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా తాజాగా నటసింహ బాలకృష్ణ నటిస్తున్న చిత్రం డాకు మహారాజ్(Daaku Maharaj). ప్రముఖ డైరెక్టర్ బాబీ(Bobby) దర్శకత్వంలో ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఫాన్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించిన ఆహా ఓటీటీ..
ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధ శ్రీనాథ్(Shraddha Shrinath) నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) విలన్ గా కనిపించబోతున్నారు. అలాగే యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి (Chandini Choudhary) కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఎస్ ఎస్ తమన్ (SS.Thaman)ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలలో వేగం పెంచింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఇదిలా ఉండగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. ముఖ్యంగా ఓటీటీ సంస్థ ఆహా ప్రత్యేకించి బాలయ్య అభిమానుల కోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నేరుగా కలిసే అవకాశం..
అసలు విషయంలోకి వెళితే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్. జనవరి 4వ తేదీన టెక్సాస్ లో ఈవెంట్ జరగబోతోంది. ఇక ఈవెంట్ కు వెళ్లే వారి కోసమే ఓటీటీ సంస్థ ఆహా సరికొత్త బంపర్ ఆఫర్ ప్రకటించింది. డిసెంబర్ 31 లోగా గోల్డ్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటే డాకు మహారాజ్ ఈవెంట్ ను లాంజ్ లో కూర్చొని చూసే అవకాశం కల్పిస్తారు. అంతేకాదు బాలయ్యను నేరుగా కలిసే అవకాశాన్ని కూడా పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా బాలయ్యను నేరుగా కలవాలి అంటే ఓటిటి ప్లాట్ఫామ్ ఆహా ఇచ్చిన బంపర్ ఆఫర్ ఆహా గోల్డ్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా డిసెంబర్ 31 లోపే. ఏదేమైనా ఈ ఆఫర్ ని మాత్రం అసలు మిస్ చేసుకోకండి అంటూ మేకర్స్ కూడా చెబుతున్నారు.
బాలకృష్ణ కెరియర్..
యుక్తవయసులో ఉన్నప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన బాలకృష్ణ తండ్రి అడుగుజాడల్లో నడిచారు. తన తండ్రి దర్శకత్వం వహించి, నటించిన చిత్రాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసి మెప్పించిన బాలయ్య.. ఆ తర్వాత హీరోగా మారి భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇటీవలే ఇండస్ట్రీలో కొచ్చి 50 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సినీ పరిశ్రమ ఈయనను ఘనంగా సత్కరించింది కూడా. తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ తన సేవలతో అటు ప్రజలను మెప్పిస్తూ దూసుకుపోతున్నారు. ఇకపోతే బాలయ్య హీరోగా, రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేస్తున్నారు. అలాగే ఆహా ఓటీటీలో వస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె కార్యక్రమానికి గత మూడు సీజన్లుగా హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ భారీ పాపులారిటీ అందుకున్నారు.