BigTV English

Priyamani: సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్.. నెల ఖర్చులు తెలిస్తే..!

Priyamani: సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్.. నెల ఖర్చులు తెలిస్తే..!

Priyamani:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న అతి కొద్ది మంది సీనియర్ హీరోయిన్స్ లో ప్రియమణి(Priyamani)కూడా ఒకరు. చక్కటి అభినయం కనబరిచే ఈమె 2003లో విడుదలైన ‘ఎవరే అతగాడు’ అనే సినిమా ద్వారా వెండితెరకు అరంగేట్రం చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అవడంతో తెలుగులో హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. కానీ తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో మాత్రం వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. దీంతో తమిళంలో కాస్త ఫేమ్ దక్కించుకున్న తర్వాత టాలీవుడ్లోకి ఫ్యామిలీ హీరో జగపతిబాబు(Jagapathi babu) నటించిన ‘పెళ్లైన కొత్తలో’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడంతో ఈమెకు వరుస అవకాశాలు తలుపు తట్టాయి.


నేషనల్ అవార్డు గ్రహీత..

ఇక మరొకవైపు 2007లో కార్తీ సరసన పారుతీవీరన్ అనే తమిళ సినిమాలో నటించడంతో ఈమె కెరియర్ యూటర్న్ తీసుకుంది. అంతేకాదు ఈమెకు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా లభించింది. ప్రియమణి అలా తెలుగు, తమిళ్ భాషలో కలిపి ఏడాదికి 10 చిత్రాలను కూడా విడుదల చేసింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మినహా బాలకృష్ణ(Balakrishna), వెంకటేష్(Venkatesh), నాగార్జున(Nagarjuna)వంటి సీనియర్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన ఈమె ఆ తర్వాత ఎన్టీఆర్(NTR)తో కూడా సినిమా చేసి ఆకట్టుకుంది. ఒకవైపు తన స్టార్ స్టేటస్ తో దూసుకుపోయే ఈమె రెమ్యూనరేషన్ విషయంలో కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉంటుంది. అందుకే ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా అప్పట్లో రికార్డు సృష్టించింది.


నెల ఖర్చులు కేవలం..

సినిమాల పరంగా భారీగా సంపాదించే ప్రియమణి తన జీవితాన్ని మాత్రం చాలా సాధారణంగా ఉండేలా చూసుకుంటుంది. తాను పెద్ద హీరోయిన్ కాబట్టి చాలా లగ్జరీగా బ్రతుకుతుందని అందరూ అనుకుంటారు. కానీ ఆమె మాత్రం చాలా సింపుల్గా కనిపిస్తుంది. ఇకపోతే చూడడానికి సింపుల్ గా కనిపించే ఈమె నెలవారి ఖర్చులు కేవలం 10,000 రూపాయలు మాత్రమే నట. సాధారణంగా హీరోయిన్స్ అందరూ మేకప్ కోసమే ప్రతినెల లక్షల రూపాయలను ఖర్చు చేస్తారు అలాంటి కాలంలో ఉన్న ఈమె.. మేకప్ ఖర్చులతో పాటు సొంత ఖర్చులకు కూడా కేవలం 10 వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తుంది అంటే ఇక ఎంత సింపుల్ గా ఉంటుందో.. అలా ఉండడానికి ఎంతలా ప్రయత్నం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

సినిమాలే కాదు టీవీ షోలు కూడా..

ఏదిఏమైనా స్టార్ స్టేటస్ లో ఉండి కూడా ఇంత తక్కువ ఖర్చు పెడుతుంది అంటే డబ్బు విలువ ప్రియమణికి చాలా బాగా తెలుసు అని నెటిజెన్స్ సైతం కామెంట్ చేస్తున్నారు. డబ్బు ఉంది కదా అని లక్షల్లో ఖర్చు పెట్టుకోకుండా.. భవిష్యత్తు తరానికి ఇలా దాచి పెట్టుకోవడం చాలా మంచి ఆలోచన అని, ఇలా చేస్తే భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే ప్రియమణి సినిమాలే కాకుండా టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. అంతేకాదు పలు వాణిజ్య ప్రకటనలలో కూడా నటిస్తూ భారీగా సంపాదిస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×