Starlink Manipur Musk| ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు టెస్లా, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో కూడా మరో సంవత్సరంలో అందుబాటులోకి రానుంది. అయితే ఇండియాలో అనుమతి లేకుండానే స్టార్ లింక్ ఇంటర్నెట్ పరికరాలను మణిపూర్ మిలిటెంట్లు ఉపయోగిస్తున్నట్లు ఇటీవల భారత సైన్యం తెలిపింది. అయితే ఈ వార్తలను ఎలన్ మస్క్ ఖండించారు.
మణిపూర్ లో సంవత్సర కాలానికి పైగా మేటీ, కుకీ వర్గాల మధ్య జరుగుతున్న సాయుధ పోరాటంలో ఇప్పటికే వందల మంది చనిపోయారు. అయితే గత కొన్ని నెలలుగా భారత సైన్యం, కేంద్ర బలగాలు మిలిటెంట్లను కట్టడి చేయడానికి రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో మణిపూర్ రాజధాని ఇంఫాల్ తూర్పు భాగంలోని ఖేరావ్ ఖునావు ప్రాంతంతో ఇటీవల భారత రక్షణ బలగాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో తుపాకులు, బాంబులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటితో పాటు ఆ ప్రాంతంలో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ పరికరాలు కూడా లభ్యమయ్యాయి. ఈ పరికరాల్లో ఒక శాటిలైట్ యాంటేనా, ఇంటర్నెట్ రౌటర్, కేబుల్స్ ఉన్నాయి.
దీనికి సంబంధిన ఫొటోలను ఇండియన్ ఆర్మీ స్పియర్ కార్ప్స్ అధికారులు ఎక్స్ లో షేర్ చేశారు. ఈ పరికరాలపై స్టార్ లింక్ కంపెనీ లొగో కూడా ఉండడం గమనార్హం. అయితే ఆ పరికరాలను మిలిటెంట్లు దుర్వినియోగం చేశారని ఎలస్ మస్క్ ఆరోపించారు.
Also Read: అమెరికా నుంచే చమురు కొనాలి లేకపోతే.. ఆ దేశాలకు ట్రంప్ వార్నింగ్
సోషల్ మీడియాపై మణిపూర్ మిలిటెంట్ల వద్ద స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ అని కొన్ని రోజుల నుంచి వైరల్ అవుతుండడంతో ఎలన్స్ తక్షణమే స్పందిస్తూ.. ఈ వార్తల్లో నిజం లేదని.. మణిపూర్ మిలిటెంట్లు స్టార్ లింక్ పరికరాలు దుర్వినియోగం చేసి ఉండవచ్చని అన్నారు. పైగా భారత దేశం భూభాగం వరు స్టార్ లింక్ శాటిలైట్ బీమ్స్ టర్న్ ఆఫ్ (క్రియాశీలకంగా లేవని) చేసి ఉన్నాయని తెలిపారు.
వివాదిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ షట్ డౌన్
వివాదిత ప్రాంతాల్లో భారత ప్రభుత్వం ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తూ ఉంటుంది. జమ్మూ కశ్మీర్ లో కూడా ఇలాగే ఉగ్రవాదులు ఇంటర్నెట్ ద్వారా సంప్రదింపులు చేయకుండా అడ్డకునేందుకు చాలా కాలం పాటు ఇంటర్నెట్ షట్ డౌన్ చేసింది. ఈ క్రమంలోనే మణిపూర్ తీవ్ర వాదులను కట్టడి చేయడానికి అక్కడ కూడా ఇంటర్నెట్ షట్ డౌన్ చేసింది. అయితే శాటిలైట్ ఇంటర్నెట్ ఉంటే ప్రభుత్వం షట్ డౌన్ చేయలేదు. అందుకే మిలిటెంట్లు స్టార్ లింక్ ని ఉపయోగించినట్లు తెలుస్తోందని నిపుణుల అభిప్రాయం. ఉక్రెయిన్ యుద్ధంలో కూడా అక్కడ సైనికులు స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ని ఉపయోగిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలున్నాయి.
స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ భారత్ పొరుగు దేశాలైన శ్రీలంక, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలలో అందుబాటులో ఉంది. అయితే ఇండియాలో మాత్రం స్టార్ లింక్ సేవలు ప్రస్తుతం బీటా ఫేస్ లో ఉన్నాయి.