Mohammed Siraj: వరల్డ్ క్రికెట్ లో భారత జట్టు అత్యుత్తమ పేస్ బౌలర్ ఎవరంటే అందరూ టక్కున చెప్పే పేరు బుమ్రా. కానీ బుమ్రా కంటే గొప్ప బౌలర్ భారత క్రికెట్ జట్టులో ఉన్నాడు. అతనెవరో కాదు.. టీమిండియా పేసర్, హైదరాబాది ఆటగాడు మొహమ్మద్ సిరాజ్{Mohammed Siraj}. వన్డేల్లో భారత జట్టు తరుపున ఈ హైదరాబాది స్టార్ ఆటగాడు సిరాజ్ విజృంభిస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లే లో పదునైన బౌలింగ్ తో ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తాడు. బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వికెట్లను రాబడుతున్నాడు.
Also Read: U19 Women’s Asia Cup: ఫైనల్‌కు చేరిన టీమిండియా
గత కొన్ని ఏళ్లుగా భారత పేస్ దళాని నడిపిస్తున్న సిరాజ్.. మూడు ఫార్మాట్లలో కీలక ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. మహమ్మద్ సిరాజ్ {Mohammed Siraj} గ్రౌండ్ బయట చూడడానికి చాలా కూల్ గా కనిపిస్తాడు. కానీ బరిలోకి దిగితే మాత్రం అగ్రెసివ్ గా ఉంటాడు. అయితే తాజాగా సిరాజ్ ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్ లోని పవర్ ప్లే ఓవర్లలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. వన్డే మ్యాచ్ లలోని మొదటి 10 ఓవర్లలో 2020 నుండి ఇప్పటివరకు అత్యధికంగా 41 వికెట్లు తీసి మొదటి స్థానంలో నిలిచాడు సిరాజ్.
41 వన్డే లలోనే {Mohammed Siraj} ఈ ఘనతని సాధించాడు. ఇక రెండవ స్థానంలో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ 42 వన్డేలలో 37 వికెట్లు పడగొట్టాడు. ఇక మూడవ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఫరూఖి 39 వన్డేలలో 29 వికెట్లు తీశాడు. నాలుగో స్థానంలో జోష్ హెజిల్ వుడ్ 47 వన్డేలలో 29, ఐదవ స్థానంలో అల్జారి జోసఫ్ 51 ఇన్నింగ్స్ లలో 27 వికెట్లు తీశాడు. 2020 నుండి ఇప్పటివరకు సిరాజ్ రికార్డ్ ని ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. 2019వ సంవత్సరం జనవరిలో ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే మ్యాచ్ తో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు సిరాజ్.
అయితే ఈ మ్యాచ్ లో సిరాజ్ {Mohammed Siraj} ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. ఆ తరువాత మళ్లీ వన్డేల్లోకి అడుగుపెట్టడానికి సిరాజ్ కి రెండు సంవత్సరాలు పట్టింది. ఇక ఇప్పటివరకు 44 వన్డేలు ఆడిన సిరాజ్ 27.82 యావరేజ్ తో 71 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్) లో అద్భుతమైన పేసర్లలో ఒకరిగా పేరుగాంచాడు సిరాజ్. గత సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున సత్తా చాటిన సిరాజ్ ని.. ఆ టీమ్ వదులుకుంది. దీంతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో సిరాజ్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి.
Also Read: R Ashwin Pension: కాంబ్లీకి మళ్ళీ అన్యాయం.. అశ్విన్‌కు డబుల్ పెన్షన్…?
చివరికి గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ సిరాజ్ {Mohammed Siraj} ని రూ. 12.25 కోట్లకు సొంతం చేసుకుంది. సిరాజ్ మొదట ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తన హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో కెరీర్ ని ప్రారంభించాడు. ఇక ఇప్పుడు గుజరాత్ జట్టులో ప్రస్తుతం ఫాస్ట్ బౌలర్లు లేని కారణంగా వారు అధిక మొత్తం తో సిరాజ్ ని సొంతం చేసుకున్నారు. సిరాజ్ ఐపిఎల్ కెరీర్ కూడా సుదీర్ఘమైంది. 93 మ్యాచ్ లలో 93 వికెట్లు తీశాడు. ఐపీఎల్ లో సిరాజ్ ఎకానమీ 8.64 గా ఉంది.