Mobile Network on Moon: అరుదైన ఘట్టం త్వరలో ఆవిష్కృతం కానుంది. ప్రముఖ మొబైల్ దిగ్గజం నోకియా కొత్త చరిత్రను సృష్టించనుంది. ఇంతవరకు ఏ సర్వీస్ ప్రొవైడర్ చెయ్యని సాహసం చేసేందుకు సిద్ధమైంది. చంద్రుడిపై మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం నాసాతో కలిసి ప్లాన్ చేసింది నోకియా.
చంద్రుడిపై మొబైల్ నెట్‌వర్క్
నోకియా కంపెనీ కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టింది. ఆ సంస్థ అభివృద్ధి చేసిన లూనార్ సర్ఫేస్ కమ్యూనికేషన్ సిస్టమ్(LSCS)ని చంద్రుని ఉపరితలంపై ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసింది. నాసాతో కలిసి ఈ స్కెచ్ వేసింది. చంద్రుడి నుంచి నేరుగా భూమికి కనెక్టివిటీ ఉండనుంది. చంద్రుని దక్షిణ ప్రాంతం షాకిల్‌టన్ క్రేటర్‌పై చివరి గమ్యస్థానానికి తీసుకెళ్లనుంది.
నాసా ఆర్టెమిస్-1 మిషన్‌లో ఉపయోగించబడుతుంది. తద్వారా చంద్రునిపై మానవ ఉనికిని స్థాపించడమే లక్ష్యంగా అడుగులు వేయనుంది.ఈ తరహా నెట్‌వర్క్ భవిష్యత్ అంతరిక్ష మిషన్ల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చగలవని భావిస్తున్నాయి. దీనికి సంబంధించి ఐదేళ్ల కిందట అంటే 2020 అక్టోబర్‌లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసాతో నోకియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 14.1 మిలియన్ డాలర్ల నిధులను వెచ్చించనుంది.
హై-డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్, కమాండ్-అండ్-కంట్రోల్ కమ్యూనికేషన్‌లు, టెలిమెట్రీ డేటా బదిలీని అనుమతిస్తుంది. విపరీతమైన ఉష్ణోగ్రతలు, రేడియేషన్‌తో సహా అంతరిక్షం లోని కఠినమైన పరిస్థితులను తట్టుకునేలా రూపొందించబడింది. ఈ మిషన్‌లో రెండు రకాల వాహనాలు ఉంటాయి. ఇంటూటివ్ మెషీన్స్ మైక్రో నోవా హాప్పర్, లూనార్ అవుట్‌పోస్ట్ యొక్క మొబైల్ అటానమస్ ప్రాస్పెక్టింగ్ ప్లాట్‌ఫామ్(MAPP)రోవర్ ఉండనున్నాయి. ఇవి నోకియా డివైజ్ మాడ్యూల్స్‌తో అమర్చబడి ఉంటాయి.
ALSO READ: మస్క్ కు వరుస షాక్‌లు, డొజెలో రాజీనామా
ఈ వాహనాలు ల్యాండర్‌లో నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవ్వడానికి నోకియా మాడ్యూల్‌ను ఉపయోగిస్తారు. ఈ పరిశోధనలు హెచ్‌డీ వీడియో, రోబోటిక్స్, సెన్సింగ్ అప్లికేషన్లు, భవిష్యత్ మిషన్‌లకు సెల్యూలర్ నెట్‌వర్క్‌లు ప్రారంభించేందుకు అవసరమన్నది నోకియా మాట. ఈ టెక్నాలజీ చంద్రునిపై మంచును గుర్తించడంలో పరిశోధకులకు సహాయ పడనుంది.
అంతరిక్ష సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో చంద్రునిపై మొబైల్ నెట్‌వర్క్ ఏర్పాటు ముందడుగుగా వర్ణిస్తున్నారు. భవిష్యత్ చంద్రుడిపై కార్యకలాపాలకు మార్గం సుగమం చేస్తుందని అంటున్నారు. అన్నట్లు 2027 నాటికి చంద్రునిపైకి మానవులను పంపి తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో నాసా, ఆర్టెమిస్ కార్యక్రమం చేపట్టింది. భవిష్యత్తులో ఇంధనం, నీరు, ఆక్సిజన్ లాంటివి గుర్తిస్తే మూన్‌పై మానవులు వెళ్లేందుకు సహాయ పడుతుందన్నది నాసా అంచనా.
టార్గెట్ ఫ్యూచర్
చంద్రుని కొద్దిరోజులు పగలు, రాత్రిళ్లు మాత్రమే ఉంటాయి. ఈ నెట్‌వర్క్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సాంకేతికత భవిష్యత్ చంద్ర మిషన్‌లకు మార్గం సుగమం చేయనుంది. 2030 నాటికి చంద్రుడిపై శాశ్వత మానవులు ఉండేలా ఉద్దేశ్యంతో ప్లాన్ చేస్తోంది. వ్యోమగాములు, మిషన్ నియంత్రణ మధ్య కమ్యూనికేషన్‌ను అందించడానికి మొబైల్ నెట్‌వర్క్ చాలా ముఖ్యమైనది అంచనా వేస్తోంది. అయితే చంద్రుడిపై నుంచి వచ్చే సంకేతాల ద్వారా అంతరాయం కలిగే ఛాన్స ఉంది.
In partnership with @Nokia, we're setting up the first mobile network on the Moon! Launching with @Int_Machines on Feb. 26, the Lunar Surface Communication System will use the same cellular tech used on Earth to establish lunar surface connectivity: https://t.co/A2482yyzYS pic.twitter.com/0bbfZz4ltV
— NASA Technology (@NASA_Technology) February 25, 2025