Ilaiyaraaja:ప్రముఖ సంగీత దర్శకులు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమాలకు సంగీతాన్ని అందించి, ఎవర్గ్రీన్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా నిన్న రాత్రి హైదరాబాదులో జరిగిన ‘షష్టిపూర్తి’ సినిమా టీజర్ వేడుకకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈయన, ఆ నిజం తెలిసిన రోజు మ్యూజిక్ ఆపేస్తానంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), అర్చన (Archana) ప్రధాన పాత్రలో పవన్ ప్రభా తెరకెక్కిస్తున్న చిత్రమే ఈ ‘షష్టిపూర్తి’. రూపేష్ (Roopesh) హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మిస్తున్నారు కూడా.. ఇందులో హీరోయిన్ గా ఆకాంక్ష సింగ్ (Akshanksha Singh) నటిస్తోంది. ఇళయరాజా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో శనివారం రాత్రి టీజర్ ను ఇళయరాజా విడుదల చేశారు.
ఆ క్షణమే మ్యూజిక్ ఆపేస్తాను – ఇళయరాజా..
టీజర్ లాంఛ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను చేసిన పని ఉంది. ఇప్పటికే కొన్ని పాటలు కూడా విన్నారు. మరికొన్ని వినబోతున్నారు కూడా.. అయితే వాటిని మళ్లీ ఎప్పటికీ అలాగే వింటూ ఉంటారని నమ్ముతున్నాను. ఈ చిత్రం కోసం కీరవాణి (Keeravani) నాకు ఒక పాట రాసి వినిపించినప్పుడు, కీరవాణికి నాకు ఉన్న ఆత్మబంధం గురించి రాశాడు అనిపించింది. నాపై ఆయనకున్న స్వచ్ఛమైన ప్రేమను ఈ పాటలో చూపించాడు. చిత్ర బృందానికి నా ఆశీర్వాదాలు. కొత్త వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ప్రోత్సహించాలనే నేను ఇక్కడికి వచ్చాను. నాకు సంగీతం తెలుసు అని నేను ఎప్పుడు అనుకోను. ఆ సంగీతానికి నేను తెలుసు అనుకుంటాను. నిజంగా నాకు ఆ పాట ఎలా వస్తుంది అనేది కూడా తెలియదు. అది ఎలా వస్తుందో.. ఆ నిజం తెలిసిన మరుక్షణమే నేను మ్యూజిక్ కంపోజ్ చేయడం ఆపేస్తాను” అంటూ కామెంట్ చేశారు ఇళయరాజా. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇళయరాజా బాల్యం..
ఇళయరాజా విషయానికి వస్తే.. 1943 జూన్ 2 న జ్ఞానదేశికన్ అనే పేరుతో జన్మించారు. సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, గాయకుడిగా కూడా పేరు సొంతం చేసుకున్న ఈయన 30 సంవత్సరాల వృత్తి జీవితంలో వివిధ భాషలలో 5000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి రికార్డు సృష్టించారు. ముఖ్యంగా దక్షిణ భారత సినీ పరిశ్రమలో గొప్ప సంగీత దర్శకులలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. ఇక ఈయన బాల్యం విషయానికి వస్తే.. తమిళనాడు రాష్ట్రం తేని జిల్లాలోని పన్నైపురం అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో రామస్వామి, చిన్నాతాయమ్మాళ్ దంపతులకు మూడవ కుమారుడిగా జన్మించారు. వ్యవసాయక ప్రాంతంలో పెరగడం వల్ల పొలాల్లో రైతులు పాడుకునే పాటలతో జానపద సంగీతం పరిచయం అయింది. సంగీత జ్ఞానం ఆయన 14ఏట బయటపడింది. తన సవతి అన్న నిర్వహించే సంగీత బృందంతో కలిసి ఊరూరు తిరిగేవారట..ఇక తర్వాత సంగీత బృందంలో చేరి తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ఒక్కో మెట్టు ఎదుగుతూ అలా ఇండస్ట్రీకి పరిచయమై.. నేడు బిగ్ బజార్ సంగీత దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు.
Big TV Kissik Talk Show : బిగ్ బాస్ వల్లే అమర్ నరకం అనుభవించాడు.. కానీ ఆయన వల్లే..!