BigTV English

Trisha: పెళ్లి పై హాట్ బాంబు పేల్చిన త్రిష.. నిరాశలో ఫ్యాన్స్..!

Trisha: పెళ్లి పై హాట్ బాంబు పేల్చిన త్రిష.. నిరాశలో ఫ్యాన్స్..!

Trisha: సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్స్ కి లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది.. అందుకే అవకాశం ఉన్నప్పుడే భారీగా ఫేమ్ సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మరి కొంతమంది హీరోయిన్స్ మాత్రం దశాబ్దాల తరబడి ఇండస్ట్రీలో అదే స్టార్ స్టేటస్ తో కొనసాగుతూ.. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటారు. అలాంటి వారిలో నయనతార (Nayanthara), త్రిష (Trisha ) కూడా ఒకరు. ఇప్పుడు ప్రత్యేకంగా త్రిష గురించి చెప్పుకోవాలి. నాలుగుపదుల వయసు దాటినా సరే ఇంకా వివాహానికి దూరం అంటూనే స్టార్ హీరోలను మొదలుకొని సీనియర్ హీరోల సినిమాలలో కూడా హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ.. మరింత బిజీగా మారిపోయింది. అంతేకాదు ప్రత్యేకించి సీనియర్ హీరోలకు బెస్ట్ అండ్ ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది.


పెళ్లి చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు – త్రిష

ఇక ఈమె కెరియర్ ను కాస్త పక్కన పెడితే.. ఈమె తోటి హీరోయిన్ లందరూ కూడా చక్కగా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటే.. త్రిష మాత్రం ఒంటరిగానే ఉంటోంది. ఇక ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు.. తన పెళ్లిపై ఊహించని కామెంట్లు చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది..ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిషకు వివాహ బంధం పై మీ అభిప్రాయం ఏంటి? అనే ప్రశ్న ఎదురవగా.. “నిజం చెప్పాలంటే నాకు వివాహ బంధం పైనే నమ్మకం లేదు. నాకు పెళ్లయినా.. కాకపోయినా.. ఎటువంటి ప్రాబ్లం లేదు” అంటూ బదులిచ్చింది. ఇక మొత్తానికి అయితే త్రిష పెళ్లి చేసుకుంటుందని, పిల్లల్ని కంటుందని , ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే చూడాలని ఎన్నో కలలు కన్న అభిమానులకు ఇది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పవచ్చు.


త్రిష పాత వీడియోలు వైరల్ చేస్తూ ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

మరొక సందర్భంలో మాత్రం.. “పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదంటే.. నా దగ్గర సమాధానం లేదు.. నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే , ఖచ్చితంగా చేసుకుంటాను. కానీ నన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి జీవితాంతం నాకు తోడుగా ఉంటాడనే నమ్మకం నాకు కలగాలి. అప్పుడే వివాహం చేసుకుంటాను. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. పెళ్లి చేసుకొని ఇప్పటికే చాలామంది అసంతృప్తితో జీవిస్తున్నారు. అలాంటి పరిస్థితులు నాకు వద్దు”అంటూ త్రిష చెప్పుకొచ్చింది. ఇక మొత్తానికి అయితే త్రిష మాటలు విని అభిమానులు ఎందుకు ఇలా రెండు మాటలు మాట్లాడుతున్నారు అంటూ అటు పాత వీడియోలను కూడా ట్యాగ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

త్రిష సినిమాలు..

ఇక త్రిష విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె తమిళ్ లో కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా నటిస్తున్న ‘థగ్ లైఫ్’ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ చిత్రం జూన్ లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక మరొకవైపు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాలో కూడా త్రిష నటిస్తోంది. ఈ సినిమా కూడా జూన్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా మొత్తానికి అయితే ఒకవైపు స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వ్యక్తిగతంగా వార్తల్లో నిలుస్తోంది త్రిష.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×