Wife Harassment Man Suicide| భార్యాభర్తల సంబంధం ప్రేమ, నమ్మకం, గౌరవంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఆలుమగలు ఇరువురూ సమప్రాధాన్యం వహించాలి. కానీ ఒకరు మాత్రమే ఈ బంధాన్ని మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తే.. అది భారంగా మారుతుంది. చివరికి విచ్ఛిన్నం అయిపోతుంది. పైగా ఈ బంధంలో అనుమానం ప్రవేశిస్తే.. మానసికంగా నరకం అనుభవించాల్సి వస్తుంది. తాజాగా అలాంటి నరకం అనుభవించలేక ఒక యువకుడు ప్రాణాలు వదిలాడు. భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే చనిపోయేముందు తన కొడుకుని ప్రాణహాని ఉందని రాసి పెట్టి మరణించాడు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ జిల్లా కు చెందిన మొహిత్ త్యాగి అనే 34 ఏళ్ల యువకుడు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగేళ్లు క్రితం 2020లో అతనికి సంభల్ జిల్లాకు చెందిన ప్రియాంక త్యాగి అనే యువతితో వివాహం జరిగింది. ఇది మోహిత్ కు రెండో పెళ్లి. మొదటి భార్య ప్రమాదంలో చనిపోయింది. అయితే మొహిత్ త్యాగికి అతని రెండో భార్య ప్రియాంక త్యాగి తో 2021 సంవత్సరంలో ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు సమర్థ్. కానీ కొడుకు పుట్టాక.. ప్రియాంక తీరు మారిపోయింది. ప్రతి రోజు అతనితో దురుసుగా ప్రవర్తించేంది. తనకు డబ్బు చాలా అవసరమని చెప్పేది. దీంతో మోహిత్ తన చేతనైనంత ఆమెకు ఇచ్చేవాడు.
అయితే ప్రియాంక రెండు నెలల క్రితం తన అన్నతో కలిసి బిజినెస్ పెట్టాలని చెప్పింది. అందుకు పెట్టుబడి కోసం భారీ మొత్తంలో డబ్బులు కావాలని అడిగింది. దీనికి మోహిత్ ఒప్పుకోలేదు. తన వద్ద అంత డబ్బు లేదని చెప్పేవాడు. అలా కొన్ని రోజుల తరువాత ప్రియాంక మరో విధంగా వేధించడం మొదలుపెట్టింది. మోహిత్ కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని తనకు తెలిసినట్లు ఆరోపణలు చేసింది. కానీ మోహిత్ మాత్రం ఈ సారి ఆమెపై కోపడ్డాడు. తనకు ఎలాంటి అక్రమ సంబంధాలు లేవని చెప్పినా ఆమె వినిపించుకోలేదు. పైగా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ కారణంగా మోహిత్ అప్పటి నుంచి భార్య, కొడుకు నుంచి దూరమయ్యాడు. ఒంటరిగా ఉండడంతో అతనికి మనశ్శాంతి లేకుండా పోయింది. తన కొడుకుని కలుద్దామని తనే భార్య వద్దకు వెళ్లాడు. కానీ అందుకు ఆమె అంగీకరించలేదు.
Also Read: ఒక్క రూపాయి కోసం హత్య.. కస్టమర్‌ని చంపిన పాన్ షాపు ఓనర్
భార్య ప్రవర్తన గురించి మోహిత్ విసిగిపోయి తన స్నేహితులతో చెప్పుకునేవాడు. ఇంట్లో తనకు సంతోషం లేకుండా పోయిందని వాపోయేవాడు. ఈ క్రమంలో ఒకరోజు మోహిత్ ఆఫీసుకి వెళ్లగా.. ఇంట్లో అతని అన్న, వదిన, చెల్లెలు ఉన్నారు. ఆ సమయంలో అతని భార్య ప్రియాంక, ఆమె అన్న కొంతమంది రౌడీలతో వచ్చి ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తీసుకెళ్లారు. అడ్డకున్న మోహిత్ అన్నను కొట్టారు. ఈ ఘటన గురించి మోహిత్ కు ఫోన్ ద్వారా తెలిసింది. దీంతో మోహిత్ తన భార్య పుట్టింటికి వెళ్లి.. ఇలా ఎందుకు చేస్తున్నారని నిలదీశాడు. కానీ ఫలితం లేకపోయింది.
మరుసటి రోజు మోహిత్ ఆఫీసులో ఉండగా.. అతనికి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. మోహిత్, అతని కుటుంబంపై అతని భార్య ప్రియాంక గృహహింస కేసు పెట్టింది. ఇది విన్న మోహిత్ ఇంటికి వెళ్లి తన భార్య పరువు తీసిందని భావించి వివరంగా ఒక లెటర్ రాసి విషం తాగాడు. కానీ అతని అన్న మోహిత్ ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెండు రోజుల తరువాత మోహిత్ చికిత్స పొందుతూ మరణించాడు.
ఇప్పుడు మోహిత్ రాసిన సూసైడ్ లెటర్ వివరాలు చదివి పోలీసులు షాకై పోయారు. అందులో తన భార్య పక్కా ప్లానింగ్ తోనే తనను వివాహం చేసుకుందని.. తన ఆస్తి పొందడానికే పెళ్లిచేసుకుందని రాశాడు. తాను అడిగినంత డబ్బులు ఇవ్వనందుకు తనను హింసించిందని తెలిపాడు. తన భార్య గురించి తనకు ఒక రహస్య విషయం తెలిసిందని.. ఆమె మోదీనగర్ లోని ఆస్పత్రిలో అనేక సార్లు గర్భం తీయించుకున్నట్లు తెలిసిందని రాశాడు. తాను చనిపోతున్నందుకు తనకు బాధగా లేదని తన కొడుకు జీవితం తన భార్య చేతిలో నాశనం అవుతుందని, అతడకి ప్రాణహాని ఉన్నట్లు రాశాడు. తన మరణానికి తన భార్య, ఆమె కుటుంబ సభ్యులే కారణమని సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు.