Ilayaraja: తెలుగు, తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఎంతమంది సంగీత దర్శకులు ఉన్నా కూడా ఇళయరాజాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇళయరాజా మ్యూజిక్ గురించి మాటల్లో చెప్పలేము. త్రివిక్రమ్ వంటి దర్శకులు కూడా ‘అమ్మాయిలు లేకుండా రొమాంటిక్ గాను, డబ్బులు లేకుండా రిచ్ గాను’ ఎన్నో సాయంత్రాలను తీర్చిదిద్దిన ఇళయరాజా గారికి రుణపడి ఉంటాను అని ఒక సందర్భంలో అన్నారు. ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సాంగ్స్ ను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించారు ఇళయరాజా. ఇప్పటికీ కూడా ఇళయరాజా పాటలు వింటుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇళయరాజా బాలు కాంబినేషన్ లో వచ్చిన పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో ఇళయరాజా మ్యూజిక్ ఎక్కడైనా వినాలన్నా కూడా కొద్దిపాటి భయం పట్టుకుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇళయరాజా మ్యూజిక్ ని ఎక్కడైనా ఉపయోగిస్తే వెంటనే కాపీరైట్ వేస్తున్నారు. చాలామంది దీని గురించి ట్రోల్ కూడా చేయడం మొదలుపెట్టారు. ఒక సందర్భంలో బాలును కూడా తన పాటలు కన్సర్ట్ పాడకూడదు అంటూ చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
ఇకపోతే ప్రస్తుతం విడుతలై అనే సినిమాకు సంగీతం అందిస్తున్నారు ఇళయరాజా. ఈ సినిమాకి వెట్రి మారన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకే విడుదలైన విడుదలై ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి సీక్వెల్ గా విడుదల 2 రానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ట్రైలర్ కూడా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ఈవెంట్ లో ఇళయరాజా స్టేజ్ పై చాలా ఫన్నీగా మాట్లాడారు. ఇళయరాజా మాట్లాడుతూ నేను ఈ సినిమాకి సంగీతం చేస్తున్నప్పుడు నా వీడియోస్ వెట్రి మారన్ రికార్డు చేశాడు. ఆ వీడియోస్ ను ఎక్కడైనా అప్లోడ్ చేస్తే మంచి ప్రైస్ వస్తుంది అంటూ చెప్పుకోవచ్చు. అంటే మంచి డబ్బులు వస్తాయి అనే ఉద్దేశ్యంతో ఇళయరాజా మాట్లాడారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read : Game Changer Third Single Promo : థమన్ స్లో పాయిజన్ ఎక్కిస్తాడు
అవి నిజంగా అప్లోడ్ చేసినట్లయితే ఇళయరాజా కాపీరైట్ ఇష్యూస్ వేసి భారీగా డబ్బు లాగే అవకాశం ఉంటుందని కొందరు మాట్లాడుతున్నారు. మలయాళం లో సూపర్ హిట్ అయిన మంజుమల్ బాయ్స్ సినిమాలో గుణ సినిమాలోని ఒక పాటను వాడారు. ఆ పాట వలన సినిమా విపరీతమైన హిట్ అయింది. ఆ సినిమా తర్వాతే ఆ పాటకు మరింత గుర్తింపు వచ్చింది. సినిమా సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న తరుణంలో ఆ సినిమాపై కూడా కాపీరైట్ వేశారు ఇళయరాజా. ఆ సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ కొంత మంది చెప్పుకొస్తున్నారు.
Also Read : Actor Subbaraju : సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సుబ్బరాజు.. ఫోటో వైరల్..