Game Changer Third Single Promo : కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న థమన్. థమన్ మ్యూజిక్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించాడు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన ప్రతి సినిమాకు థమన్ సంగీతం అందించాడు. ప్రస్తుతం తమన్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో గేమ్ చేంజెర్ ఒకటి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన ఈ సినిమా నిర్మితమైంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమా తర్వాత రామ్ చరణ్ కంప్లీట్ రోల్ లో కనిపిస్తున్న సినిమా ఇది. ఇదివరకే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ఇక రీసెంట్ గా మూడో పాట కు సంబంధించిన ప్రోమో సాంగ్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ పాటను రామజోగయ శాస్త్రి రాశారు. కార్తీక్, శ్రేయ ఘోషల్ ఈ పాటను ఆలపించారు. ఈ పాట ప్రోమోతోనే మంచి ఫీల్ ను క్రియేట్ చేసింది అని చెప్పాలి. ఈ పాట గురించి ముగ్గురు మాట్లాడుతూ తమ ఎక్స్పీరియన్స్ ను చెప్పుకొచ్చారు. “నానా హైరానా ప్రియమైన హైరానా,మొదలాయి నాలోనా లలన నీ వలన” అనే లైన్స్ తో మొదలైన ఈ పాట వినగానే వినసొంపుగా అనిపించింది. ముఖ్యంగా థమన్ కెరియర్ లో మరో మెలోడీ సాంగ్ వచ్చింది అని చెప్పాలి. అలవైకుంఠపురంలో సామజవరగమన పాట వినగానే ఎంతగా నచ్చిందో ఈ పాట కూడా అదే స్థాయిలో ఉండబోతుంది అని అర్థమవుతుంది. ముఖ్యంగా థమన్ అందించిన ట్యూన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇక శంకర్ ఎటువంటి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు అని క్యూరియాసిటీ కూడా మొదలైంది.
#NaanaaHyraanaa 🎶🎵⭐️#GameChangerThirdSingle
From NOV 28 th 🩵❤️ pic.twitter.com/sYGtObsmsk
— thaman S (@MusicThaman) November 26, 2024
శంకర్ సినిమాలలో గ్రాండ్ విజువల్స్ తో ఎప్పుడు ఒక సాంగ్ ఉంటూనే ఉంటుంది. ఇక ఈ సినిమాలో ఆ స్థాయిలో ఈ పాట ఉండబోతుంది అని అర్థమవుతుంది. కొన్ని పాటలు వినగానే నచ్చవు, వినగా వినగా నచ్చుతాయి. కానీ ఈ పాట మాత్రం వినగానే ఎక్కుతుంది అని చెప్పాలి. ఇప్పటివరకు వచ్చిన మాస్ కమర్షియల్ సాంగ్స్ ఒక ఎత్తు, ఈ మెలోడీ సాంగ్ దానిని మించి. ఖచ్చితంగా కొన్ని రోజులు పాటు ప్లే లిస్టు ను ఈ సాంగ్ రూల్ చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ పూర్తి పాట నవంబర్ 28న రిలీజ్ కానుంది. ఈ పాట కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు మ్యూజిక్ లవర్స్.
Also Read : Nani Odela movie : నానికి సీనియర్ విలన్ ను సెట్ చేసిన శ్రీకాంత్