Actor Subbaraju : టాలీవుడ్ ప్రముఖ నటుడు సుబ్బరాజు గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఈయన నటించిన సినిమాలు మంచి టాక్ ను అందుకున్నాయి. బాహుబలి లాంటి సినిమాల్లో నటించి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. సినిమాల పరంగా ఈయన దూసుకుపోతున్నాడు. వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్నాడు. ఇక తాజాగా ఈయన ఓ ఇంటివాడు అయ్యాడు. వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. ఇన్నేళ్ల తర్వాత ఆయన పెళ్లి చేసుకోవడం పై ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈయన పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈయన పెళ్లిని ఆడబంరంగా చేసుకున్నట్లు కనిపించలేదు. అందుకే ఎటువంటి హడావిడి లేకుండా కానిచ్చేసాడు. పెళ్లి తర్వాత ఈయన భార్యతో కలిసి బీచ్‌లో దిగిన ఫొటోను ఇన్‌స్టా వేదికగా ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలో సుబ్బరాజు దంపతులు వధూవరుల గెటప్‌లో చాలా సింపుల్‌గా కనిపించారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది. ఇకపోతే సుబ్బరాజు వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలియడంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన వారితో పాటు అభిమానులు కొత్త జంటకు విషెస్ తెలియజేస్తున్నారు.
ఇకపోతే సుబ్బరాజు పెళ్లి చేసుకున్న డీటెయిల్స్ మాత్రం తెలియలేదు. ఆమె ఎవరన్న విషయాన్ని బయటపెట్టలేదు. ఏది ఏమైన కూడా ఆయన పెళ్లి చేసుకున్నారు అని ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సుబ్బరాజు సుబ్బరాజు 50కి పైగా తెలుగు సినిమాల్లో నటించారు. అలాగే పలు తమిళ, హిందీ, మలయాళం చిత్రాల్లో కూడా నటించారు. ఎక్కువగా ప్రతినాయకుడి పాత్రల్లో కనిపించారు. అలాగే పలు సినిమాల్లో కామెడీ పాత్రల్లోనూ నటించి మెప్పించారు. భీమవరానికి చెందిన సుబ్బరాజు ఖడ్గం, ఆర్య, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, లీడర్, బాహుబలి2, బిజినెస్ మ్యాన్, వాల్తేరు వీరయ్య వంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ప్రస్తుతం నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.