Ileana D’Cruz: దేవదాసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ఇలియానా. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది గోవా బ్యూటీ. ఇక ఈ సినిమా తరువాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే అమ్మడు ప్రేమ మత్తులో పడి ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తరవాత ప్రేమ విఫలమయ్యి డిప్రెషన్ లో బరువు పెరిగి కనిపించింది.
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అన్నట్లు బొద్దుగా ఉన్న ఇలియానాను ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. ఇక తెలుగులో సెట్ కాదులే అనుకుని బాలీవుడ్ లో సెటిల్ అయిన ఈ చిన్నది రెండేళ్ల క్రితం.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యినట్లు తెలిపి షాక్ ఇచ్చింది. ఒక మగబిడ్డకు జన్మనిచ్చాక కూడా తన భర్తను పరిచయం చేసింది లేదు. ఈ మధ్యనే ఆమె.. తన భర్తను పరిచయం చేసింది. అతని పేరు మైఖేల్ డోలన్.
ప్రేమికుల రోజు సందర్భంగా మైఖేల్ ను పరిచయం చేసింది కానీ.. ముఖాన్ని మాత్రం చూపించలేదు. ఇక ఎట్టకేలకు తన కొడుకు మొదటి పుట్టినరోజున.. భర్త ముఖాన్ని రివీల్ చేసింది. ఇలియానా కొడుకు పేరు కోవా ఫీనిక్స్ డోలన్. ఆగస్టు 1న కోవా మొదటి పుట్టినరోజును ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఫోటోలను ఇలియానా తాజాగా అభిమానులతో పంచుకుంది.
ఇక ఈ ఫోటోలలో తన ఫ్యామిలీని పరిచయం చేసింది. కొడుకు పుట్టినరోజు వేడుకల్లో మైఖేల్ కనిపించాడు. వైట్ షర్ట్ అండ్ బ్లూ జీన్స్ తో మైఖేల్ కనిపించగా.. ఫ్లోరల్ టాప్ తో ఇలియానా కనిపించింది. ఇక కోవా కేక్ తో ఆడుకుంటూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఇలియానా కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలను లైన్లో పెడుతుంది. మరి త్వరలో తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.