BigTV English

Sobhita Dhulipala: అక్కినేని ఇంటి కోడలు.. అప్పుడే సమంతను వెనక్కి నెట్టేసిందిగా

Sobhita Dhulipala: అక్కినేని ఇంటి కోడలు.. అప్పుడే సమంతను వెనక్కి నెట్టేసిందిగా

Sobhita Dhulipala: ఒకప్పుడు  సమంత.. సమంత.. సమంత అని  సోషల్ మీడియాను షేక్ చేసిన నెటిజన్స్.. ఇప్పుడు శోభితా పేరు తలుస్తున్నారు. వీరిద్దరి గురించి అంతగా నెటిజన్స్ మాట్లాడుకోవడానికి కారణం అక్కినేని కుటుంబం. హీరోయిన్  గా సామ్ కు ఉన్న రేంజ్ కేవలం మూవీస్ కు మాత్రమే సొంతమైన తరుణంలో.. ఆమె వివాహం అక్కినేని నాగచైతన్యతో జరిగింది. అప్పటినుంచి అక్కినేని  కోడలు అనే గౌరవంతో పాటు.. స్టార్ రేంజ్ కూడా పెరిగింది. ఎక్కడకు వెళ్లినా.. సామ్ ను అక్కినేని కోడలిగానే  ట్రీట్ చేసేవారు.


చై- సామ్ జంట అక్కినేని కుటుంబానికి హైలైట్ అని పొగిడేవారు. ఇక  అలా ఆమె అత్యంత ప్ర‌జాదార‌ణ  పొందిననటిగా  గుర్తింపు తెచ్చుకుంది. ప్రతిసారి ఎంట‌ర్‌టైన్‌మెంట్ పోర్ట‌ల్ ఐఎండీబీ ర్యాంకింగ్ లో సామ్  పేరు లేకుండా ఉండేది కాదు అంటే అతిశయోక్తి కాదు. అలా అక్కినేని కోడలిగా మొదలైన ఆమె స్టార్ డమ్.. ఆ తరువాత వివాదాల మధ్య  కొనసాగింది. వివాదాల  వలన సామ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ వచ్చింది.

Pushpa 2: సంధ్య థియేటర్ ఘటన.. స్పందించిన అల్లు అర్జున్ టీమ్


ఎప్పటికప్పుడు  ఐఎండీబీ ర్యాంకింగ్ లో సామ్ టాప్ 10 ప్లేస్ లలో  టాలీవుడ్ నుంచి మొదటి స్థానంలో ఉండేది. కానీ, ఈసారి.. అమ్మడు వెనక్కి తగ్గింది. అది కూడా మరో అక్కినేని కోడలి వలన.. అదే అండీ నటి శోభితా ధూళిపాళ్ల వలన. సామ్ తో విడాకుల తరువాత చై.. శోభితాతో ప్రేమలో పడ్డాడు. ఇక ఎప్పుడైతే.. చైతో శోభితా రిలేషన్ లో ఉందని బయటపడిందో.. ఆమె గురించి నెటిజన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు. అసలు ఎవరీ  శోభితా.. ? ఎక్కడ నుంచి వచ్చింది.. ? ఏ సినిమాల్లో నటించింది.. ? చై- శోభితాకు పరిచయం ఎప్పుడు అయ్యింది.. ? ఇలా ప్రతిదీ  ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

ఇకఎప్పుడైతే అక్కినేని కుటుంబం.. చై- శోభితాలా ఎంగేజ్ మెంట్  ను అనౌన్స్ చేసిందో.. ఆమె ఒక్కసారిగా స్టార్స్ లిస్ట్ లోకి చేరిపోయింది. అక్కినేని ఇంటి కోడలిగా సామ్ గౌరవం శోభితా చేజిక్కించుకుంది. ఇప్పుడు ఆమె ఏం చేసినా ఒక సెన్సేషన్. ఎక్కడ కనిపించినా అక్కినేని కోడలు అని చెప్పుకొచ్చేస్తున్నారు. అలానే ఐఎండీబీ ర్యాంకింగ్ లో కూడా ఈసారి సామ్ ను వెనక్కి నెట్టి శోభితా ముందు వరుసలో నిలబడింది.తాజాగా 2024లో  అత్య‌ధికంగా వెతికిన న‌టీన‌టుల జాబితాను ఐఎండీబీ విడుదల చేసింది.

Pavani Karanam: ‘పుష్ప 2’లో పుష్ప రాజ్ అన్న కూతురిగా నటించింది ఎవరో తెలుసా?

ఇక ఈసారి  మొదటి స్థానంలో ఊహించని పేరు వచ్చింది. అనిమల్ తో ప్రపంచం మొత్తానికి బాబీగా మారిన త్రిప్తి డిమ్రి ఫస్ట్ ప్లేస్ ను అందుకుంది. ఆ త‌రువాత రెండో స్థానంలో దీపికా ప‌దుకొణె  నిలబడింది. ఇక మూడో స్థానంలో ఇషాన్ ఖట్టర్ నిలువగా.. నాలుగోవ స్థానంలో షారుఖ్ ఖాన్ నిలిచాడు. ఇక టాప్ 5 ప్లేస్ ను అక్కినేని కోడలు శోభితా కొట్టేయగా.. ఆరో స్థానంలో శర్వారీ నిలిచింది. ఇక 7 వ స్థానాన్ని ఐశ్వర్యారాయ్ బచ్చన్ కైవసం చేసుకోగా .. 8 వ స్థానంను సమంత అందుకుంది.  9 వ స్థానంలో అలియా భట్ నిలవగా .. ఆఖరి స్థానాన్ని ప్రభాస్ అందుకున్నాడు. ఇక ఈ లిస్ట్ చూసాకా.. అక్కినేని ఇంటి కోడలు.. అప్పుడే సమంతను వెనక్కి నెట్టేసిందిగా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×