BigTV English

Pushpa 2 – Pushpa 3 : సుక్కు గారి చిక్కు ముడులు… పార్ట్ 3లో వీటికి సమాధానం వస్తుందా..?

Pushpa 2 – Pushpa 3 : సుక్కు గారి చిక్కు ముడులు… పార్ట్ 3లో వీటికి సమాధానం వస్తుందా..?

Pushpa 2 – Pushpa 3 : ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా కోసం ఆడియన్స్ ఎంతగా ఎదురు చూశారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేడు ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సాధించుకుంటుంది. ముఖ్యంగా సుకుమార్ అల్లుఅర్జున్ ని డిజైన్ చేసిన క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికల్లో కూడా ఈ సినిమాపై మంచి ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఇక రీసెంట్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సీక్వెల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక హిట్ సినిమాకి సీక్వెల్స్ వస్తూనే ఉంటాయి. ఎస్ఎస్ రాజమౌళి మొదలుపెట్టిన ఈ ట్రెండు ని ఇప్పుడు చాలామంది దర్శకులు ఫాలో అవుతున్నారు. బాహుబలి సినిమా ఏ స్థాయిలో హిట్ అయిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బాహుబలి 2 కోసం ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూశారు. దాని కారణం బాహుబలి సినిమాను ఎస్.ఎస్ రాజమౌళి డిజైన్ చేసిన విధానం. బాహుబలి పార్ట్ వన్ అయిపోగానే కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అని చాలామంది తెలుసుకోవాలని ఎంతో ఆతృతతో బాహుబలి 2 కోసం ఎదురుచూసారు.


ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కూడా సీక్వెల్ రానుంది. అయితే ఆ సినిమా విషయంలో చాలామంది క్లైమాక్స్ ఆసక్తికరంగా లేదు అంటూ కామెంట్స్ కూడా చేశారు. పుష్ప సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే పుష్ప సినిమాలో లేని అన్ని ప్రశ్నలు పుష్ప 2 సినిమాకి మొదలయ్యాయి. పుష్ప సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఒక డౌట్ పుట్టుకొస్తుంది.

– వేర్ ఈజ్ పుష్పా… టీజర్ ఎక్కడా..?
– జపాన్‌లో ఫైట్ ఏంటి (ఇంట్రడక్షన్ సీన్)
– ముఖ్యమంత్రి వద్దు అన్నా… జగపతి బాబు తమ్ముడి కొడుకును చంపేస్తాడు పుష్ప రాజ్. మరి ముఖ్యమంత్రి రియాక్షన్ ఏంటి.. పుష్పకు నెగిటివ్ గా మారుతాడా…
– ఫహద్ ఫజిల్ చనిపోయాడా..? బతికే ఉన్నాడా..?
– మంగళం సీను, దాక్షాయని ఏదో చేస్తా అన్నారు.. పార్ట్ 2 లో అయితే ఏం చేయలేదు. వెర్రి పుష్పాలు అయ్యారు అంతే.
– కేంద్ర మంత్రి జగపతి బాబు రియాక్షన్ ఏంటి..?
– పుష్ప రాజ్ బతికే ఉన్నాడా..?
– బాంబ్ బ్లాస్ట్ తర్వాత పరిస్థితి ఏంటి..?
– ఇంతకీ బాంబ్ బ్లాస్ట్ చేసింది ఎవరు?
– పుష్ప రాజ్ కు పుట్టింది అబ్బాయా.? అమ్మాయా.?
– అబ్బాయి అంటే వేరే హీరోను తీసుకుస్తున్నారా.?
– పుష్ప అంటే ఇంటర్నెషనల్ అన్నాడు. కానీ, ఒక దుబాయ్ మాత్రమే చూపించారు. జపాన్ లో ఎవరితో చేశాడు డీలింగ్స్
– జపాన్ లో ఉన్న బాస్ ఎవరు…?


వీటన్నిటిని మించి ఈ సినిమాలో షేకావత్ విలన్ గా కనిపించాడు. షేకావత్ ఎర్రచంద్రాన్ని పట్టుకుంటాడు. అది డమ్మీ ఎర్రచందనం కావడంతో, దాన్ని ఫహాద్ పేల్చేస్తాడు. అది పేల్చేస్తే పుష్ప అనే పేల్చినట్టు అవుతుందని క్రియేట్ చేసి, పార్ట్ 3 లో ఆ కేసును హైలైట్ చేస్తారా… అనే సందేహం కూడా మొదలయ్యింది. పుష్ప 3 సినిమాకి సంబంధించి చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి. ఇక వీటన్నిటికీ సమాధానం పుష్ప 3 సినిమాలో దొరికే అవకాశం ఉంది. సీక్వెల్ తోనే లెక్కలు మాస్టారు చాలా చిక్కు ముడులు వేశారు.

Also Read : Sobhita Dhulipala: అక్కినేని ఇంటి కోడలు.. అప్పుడే సమంతను వెనక్కి నెట్టేసిందిగా

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×