BigTV English

Rajamouli: రమా రాజమౌళికి మాత్రమే నచ్చిన సినిమాలేంటో తెలుసా..?

Rajamouli: రమా రాజమౌళికి మాత్రమే నచ్చిన సినిమాలేంటో తెలుసా..?

Rajamouli..టాలీవుడ్ దిగ్గజ దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించి, ప్రపంచస్థాయి గుర్తింపును అందించిన ఘనత ఈయనకే దక్కుతుంది. ఒకప్పుడు ‘శాంతి నివాసం’ అనే సీరియల్ కి ఎపిసోడ్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టి.. ‘స్టూడెంట్ నెంబర్ వన్’, ‘సింహాద్రి’, ‘విక్రమార్కుడు’, ‘ఈగ’, ‘మగధీర’, ‘సై’, ‘యమదొంగ’, ‘రాజన్న’, ‘ఛత్రపతి’, ‘మర్యాద రామన్న’ , ‘బాహుబలి1&2’, ‘ఆర్ఆర్ఆర్’ అంటూ దాదాపు 12చిత్రాలు చేసి, ఆ 12 చిత్రాలతో కూడా సూపర్ సక్సెస్ అందుకున్నారు రాజమౌళి. ముఖ్యంగా ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు దక్కించుకున్న ఈయన.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్థాయిని సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఈ సినిమాలలో నటించిన హీరోలకి కూడా గ్లోబల్ స్టేటస్ లభించింది.


మహేష్ – రాజమౌళి మూవీ కోసం ఆడియన్స్ ఎదురుచూపు..

ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu) తో సినిమా చేస్తున్న రాజమౌళి.. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ సినిమాగా రూపు దిద్దుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ను తీసుకోవడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటివరకు మహేష్ బాబు తెలుగు తప్ప మరో భాషలో నేరుగా సినిమా చేయలేదు. ఆయన నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. అయితే ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ ఒక్క సినిమాతో మహేష్ బాబుకు టాలీవుడ్ నుండి ప్రపంచ స్థాయి గుర్తింపు లభిస్తుందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. మరి ఈ సినిమాతో అటు మహేష్ బాబు ఇటు రాజమౌళి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలని ప్రపంచ స్థాయి అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం.


ALSO READ:Aamir Khan: విడాకుల తర్వాత తొలిసారి స్పందించిన మిస్టర్ పర్ఫెక్ట్.. దేవదాస్ అయ్యానంటూ..!

రమా రాజమౌళికి ఇష్టమైన చిత్రాలు ఇవే..

ఇకపోతే తాను తీసే ఏ సినిమా అయినా సరే.. చాలా పగడ్బందీగా తెరకెక్కించే రాజమౌళికి సినిమా విషయంలో ఎంత ఫ్యాషన్ ఉందో ఆయన సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రఖ్యాతగాంచిన జేమ్స్ కామరూన్ లాంటి దర్శకుడు కూడా రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు. ఇకపోతే రాజమౌళి కష్టం వెనుక ఆయన భార్య రమా రాజమౌళి(Rama Rajamouli) ఉన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాలకు ఆమె స్టైలిస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక రాజమౌళికి అన్ని విషయాలలో కూడా సహాయం చేసే ఈమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు రాజమౌళి చేసిన సినిమాలలో తనకు బాగా నచ్చిన సినిమాల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

ఆ సినిమాలలో రాజమౌళి ఎఫర్ట్ కనిపిస్తుంది – రమా రాజమౌళి

రమా రాజమౌళి మాట్లాడుతూ.. “రాజమౌళి ఇప్పటివరకు 12 సినిమాలు చేశారు. అందులో నాకు ‘విక్రమార్కుడు’, ‘మగధీర’ సినిమాలంటే చాలా ఇష్టం. ఆ సినిమాల్లో రాజమౌళి పెట్టిన ఎఫర్ట్ పూర్తిగా కనిపిస్తుంది. ఈ రెండు సినిమాలు విజయం సాధించడమే కాకుండా ఆయనను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి” అంటూ రాజమౌళి పై ప్రశంసలు కురిపించింది. ఏది ఏమైనా రాజమౌళి ఆచి తూచి అడుగులు వేస్తూ ప్రతి సన్నివేశాన్ని ఎంతో పగడ్బందీగా ప్లాన్ చేస్తూ.. నటీనటులను సైతం చెక్కి.. వారిలోని ప్రతిభను బయటకు తీసి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న ఎస్ ఎస్ ఎం బి 29 సినిమాతో రాజమౌళి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×