BigTV English

CSK VS MI: బౌలింగ్ చేయనున్న చెన్నై…ఇరు జట్ల వివరాలు ఇవే

CSK VS MI: బౌలింగ్ చేయనున్న చెన్నై…ఇరు జట్ల వివరాలు ఇవే

CSK VS MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో  ( Indian Premier League 2025 Tournament )
భాగంగా.. ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మూడవ మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( Chennai Super Kings team ).. మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో… ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.


Also Read: SRH VS RR: బ్యాటింగ్ చేయనున్న SRH… 300 కొట్టడం పక్కా! 

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ రికార్డులు


చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఇప్పటివరకు 37 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ కంటే ముంబై ఇండియన్స్ పై చేయి సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ పై ఏకంగా 20 మ్యాచ్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది ముంబై ఇండియన్స్. అటు ముంబై ఇండియన్స్ పై… 17 మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ రెండు జట్లలో.. హైయెస్ట్ స్కోర్ 219. అది కూడా ముంబై ఇండియన్స్ సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ 218 పరుగులు చేయడం జరిగింది. లోయస్ట్ స్కోర్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలోనే ఉంది. 79 పరుగులకు ముంబై ఇండియన్స్ చేతిలో ఆల్ అవుట్ అయింది చెన్నై సూపర్ కింగ్స్. అటు ముంబై ఇండియన్స్ 136 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

ఇక ఇది ఇలా ఉండగా.. ఇవాల్టి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ బాధ్యతలు తీసుకున్నారు. హార్దిక్ పాండ్యాపై వేటుపడడంతో…. సూర్య కుమార్ యాదవ్ కు కెప్టెన్సీ అవకాశం వచ్చింది. గత సీజన్ లో… హార్దిక్ పాండ్యా పై నిషేధం విధించారు. అయితే అప్పటికే సీజన్ పూర్తి కావడంతో ఈ సీజన్ తొలి మ్యాచ్ నుంచి దూరమయ్యాడు హార్థిక్ పాండ్యా. ఈ నేపథ్యంలోనే… ఇవాల్టి ఒక్క మ్యాచ్కు సూర్యకుమార్ యాదవ్.. కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(w), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్ (సి), రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్, ఎంఎస్ ధోని (w), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్

Also Read: IPL 2025: ఐపీఎల్ మ్యాచ్ లతో జాగ్రత్త… మఫ్టీ గెటప్ లో లేడీలు ?

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×