BigTV English

Sandhya theatre : ఇంకా విషమంగానే రేవతి కుమారుడు శ్రీ తేజ కండిషన్… వైద్యులు ఏమన్నారంటే..?

Sandhya theatre : ఇంకా విషమంగానే రేవతి కుమారుడు శ్రీ తేజ కండిషన్… వైద్యులు ఏమన్నారంటే..?

Sandhya theatre.. పుష్ప 2(Pushpa 2).. యావత్ దేశవ్యాప్తంగా అటు సినీ ప్రజలు, ఇటు అభిమానులు వేయికళ్లతో మూడేళ్లుగా ఎదురుచూసిన చిత్రం ఇది. ఎట్టకేలకు 2024 డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా విడుదలైన వారంలోపే రూ.1000 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఏ ఒక్క సౌత్ హీరో దక్కించుకోని క్రేజ్ నార్త్ లో అల్లు అర్జున్(Allu Arjun)సొంతం చేసుకున్నారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే రూ.294 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అప్పటివరకు ఉన్న ‘బాహుబలి2’, ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులను సైతం బ్రేక్ చేసింది ఈ సినిమా.


సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి మృతి..

ఇదిలా ఉండగా పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో ను డిసెంబర్ 4వ తేదీన అర్ధరాత్రి వేసిన విషయం తెలిసిందే.. అయితే హైదరాబాదులో క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య థియేటర్లో ఈ బెనిఫిట్ షో చూడడానికి అల్లు అర్జున్ వచ్చారు. అయితే ఆయన సైలెంట్ గా కార్ లో వచ్చి ఉంటే అంతా సరిపోయేది. కానీ ఆయన ర్యాలీగా వచ్చేసరికి అభిమానులు హీరోని చూడడానికి ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. దీని కారణంగా అల్లు అర్జున్ పై కేసు ఫైల్ అయింది. మరోవైపు అదే థియేటర్లో సినిమా చూడడానికి వచ్చిన రేవతి (39) తొక్కిసలాటలో భాగంగా అక్కడికక్కడే మరణించింది. ఆమె కొడుకు శ్రీతేజ (9) అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.


శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి విషమం..

గత పది రోజులుగా వెంటిలేటర్ పైనే శ్రీతేజకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఐసీయూలోనే చికిత్స తీసుకుంటున్నారు. బాలుడిని కాపాడడానికి డాక్టర్లు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. శ్రీ తేజ కోలుకోవడానికి మరింత సమయం పట్టొచ్చు అని డాక్టర్లు కూడా తెలియజేశారు. మరో 10 నుంచి 15 లైఫ్ సపోర్ట్ కావాలి అని , హార్ట్ బీట్ అన్నీ బాగానే ఉన్నాయని, అయితే న్యూరాలజీ కండిషన్ ఇంకా మెరుగుపడాలి అని వైద్యులు చెప్పినట్లు సమాచారం. ఇక శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని , బాలుడు మళ్లీ ఎప్పటిలాగే తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షిస్తున్నారు. అటు వైద్యులు కూడా తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

అల్లు అర్జున్ అరెస్ట్.. బెయిల్ మీద విడుదల..

ఇకపోతే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి ర్యాలీ నిర్వహించుకుంటూ రావడంతో కేసు నమోదు అయింది. దీంతో ఆయనను నిన్న పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టుకు తరలించగా 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. అదే సమయంలో రేవతి భర్త భాస్కర్ స్పందిస్తూ.. తాను అల్లు అర్జున్ ని అరెస్టు చేసినట్లయితే తాను తన కంప్లైంట్ ను వెనక్కి తీసుకుంటానంటూ ట్విస్ట్ ఇచ్చారు. అయితే భాస్కర్ అలా చెప్పారో లేదో అప్పుడే అల్లు అర్జున్ ను చంచల్గూడా జైలుకి రిమాండ్ కు తరలించారు. కానీ ఆయన తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి మధ్యంతర బెయిల్ ను నాలుగు వారాల పాటు తీసుకొచ్చారు. ఇక రాత్రంతా చంచల్గూడా జైల్లో ఉన్న అల్లు అర్జున్ ఈరోజు విడుదలయ్యారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×