Virat Kohli – Anushka Sharma: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ ముగిసిన తరువాత లభించిన విరామాన్ని మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఈ సమయంలో గుళ్ళు గోపురాలు, ఆధ్యాత్మిక గురువులు, పలు పర్యాటక ప్రాంతాల దగ్గరకు వెళుతున్నాడు.
Also Read: Jasprit Bumrah: టీమిండియాకు షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్ ?
ఇటీవల కోహ్లీ దంపతులు {Virat Kohli – Anushka Sharma} తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ ధామ్ లో ఉన్న ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జి మహారాజ్ దగ్గరికి వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. 2023 జనవరిలో ఈ గురువు ఆశీస్సులు తీసుకున్న విరాట్ – అనుష్క.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి ఆ స్వామీజీ దగ్గరకు వెళ్లారు. వెళ్ళగానే {Virat Kohli – Anushka Sharma} ఆ స్వామి ఎదుట సాష్టాంగ ప్రమాణం చేశారు. అనంతరం ప్రేమానంద్ స్వామీజీతో కాసేపు ముచ్చటించారు.
అనుష్క మాట్లాడుతూ.. ” క్రిందటి సారి మేము వచ్చినప్పుడు నా మనసులో కొన్ని ప్రశ్నలు మిగిలాయి. వాటిని అడగాలని అనుకున్నప్పటికీ.. అప్పటికే ఇక్కడ కూర్చున్న వాళ్లు వాటిని అడిగారు. దీంతో మాలో మేమే మీతో మాట్లాడినట్లుగా అనిపించింది” అని పేర్కొంది అనుష్క. ఇక ప్రేమానంద్ జి మహారాజ్ మాట్లాడుతూ.. మీరిద్దరూ {Virat Kohli – Anushka Sharma} చాలా ధైర్యవంతులని, ప్రపంచంలో మీరు ఇంత సాధించిన తర్వాత కూడా భక్తి వైపు మోగ్గుచూపడంతో మీరు అనుకున్నవన్నీ మీకు దక్కుతాయని అన్నారు.
ఈ క్రమంలో విరుష్క దంపతుల పిల్లల ఫోటోలు రివిల్ అయ్యాయి. దీంతో వారి ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చెక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా కోహ్లీ ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఓ అమ్మాయితో ప్రత్యక్షమయ్యారు. ఆమె ఎవరో కాదు అతని భార్య అనుష్క శర్మ. కోహ్లీ వైట్ క్యాప్, మరియు బ్లాక్ కలర్ పాయింట్, టీ షర్ట్ ధరించారు. ఇక అనుష్క శర్మ బ్లూ కలర్ ఓవర్ సైజ్ షర్టులో కనిపించింది.
Also Read: Akaay Kohli: విరుష్క దంపతుల పిల్లల ఫోటోలు వైరల్.. ఎలా ఉన్నారో చూడండి!
దీంతో ఫోటోగ్రాఫర్లు వెంటనే వారిని ఫోటోలు తీయడం ప్రారంభించగా.. వారికి గుడ్ మార్నింగ్ అని తెలిపారు విరాట్. అయితే ఈసారి మాత్రం {Virat Kohli – Anushka Sharma} పిల్లలతో కాకుండా ఈ జంట గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ప్రత్యక్షమయ్యారు. ఈ వీడియోలో విరాట్ తన చేతిని అనుష్క పై వేసినట్లుగా కనిపిస్తోంది. ఇక అనుష్క పర్స్ ని తన భుజంపై వేసుకొని ఫోటోలకి ఫోజులిచ్చాడు విరాట్ కోహ్లీ. వీరు గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద సర్ప్రైజ్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
VIDEO OF THE DAY…!!!!
– The reaction from the Girl when she saw Virat Kohli was priceless 🙇 [Manav Manglani] pic.twitter.com/Vu0cN1qquF
— Johns. (@CricCrazyJohns) January 12, 2025