ICC Under 19 Womens T20 World Cup:ఐసీసీ అండర్ 19 మహిళల ప్రపంచ కప్ 2025 టోర్నమెంటులో టీమిండియా దూసుకు వెళ్తోంది. ఇప్పటికే రెండు మ్యాచ్లు విజయం సాధించిన టీమిండియా… ఇవాళ తన ఖాతాలో మరో విక్టరీని నమోదు చేసుకుంది. ఇవాళ ఈ టోర్నమెంట్ లో భాగంగా ఆరవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా మహిళల జట్టు, బంగ్లాదేశ్ మధ్య ఫైట్ జరిగింది.అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా అండర్ 19 మహిళల జట్టు(India Women U19) ఏకంగా 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. కేవలం రెండు వికెట్లు నష్టపోయి టీమిండియా విజయం సాధించింది. 65 పరుగుల లక్ష్యాన్ని 7.1 ఓవర్లలోనే చేదించింది టీమిండియా అండర్ 19 మహిళల జట్టు.
AlsoRead:Virat Kohli: ఫామ్ లేక కోహ్లీ విల విల.. రంగంలోకి ముగ్గురు సీఎంలు ?
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళల జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 64 పరుగులు చేసింది. టీమిండియా మహిళల బౌలర్లు… అద్భుతమైన బంతులు సంధించడంతో… అతి తక్కువ స్కోరు చేసింది బంగ్లాదేశ్ మహిళల జట్టు. ఈ తరుణంలోనే బంగ్లాదేశ్ మహిళల జట్టులో ఏ ఒక్క ప్లేయర్ కూడా డబుల్ డిజిట్ దాటలేకపోయారు.కేవలం ఇద్దరు ప్లేయర్లు మాత్రమే… డబుల్ డిజిట్ చేయగలిగారు. కెప్టెన్ సుమయ అక్తర్ మాత్రమే 29 బంతుల్లో 21 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ఆమెకు ఎవరు సపోర్ట్ గా నిలువ లేకపోవడంతో… బంగ్లాదేశ్ 20 ఓవర్లలోనే 64 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ తరుణంలోనే… టీమిండియా బౌలర్లలో వైష్ణవి శర్మ మరోసారి మెరిసింది. ఈ మ్యాచ్లో… నాలుగు ఓవర్లు వేసిన టీమ్ ఇండియా బౌలర్ వైష్ణవి శర్మ 15 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసింది.
ఇటీవల జరిగిన మ్యాచ్ లో కూడా హైట్రిక్ తో పాటు ఐదు వికెట్ల రికార్డును కూడా ఆమె సొంతం చేసుకుంది. ఇక చిన్న లక్ష్యాన్ని టీమిండియా ప్లేయర్లు ఆచితూచి ఆడి సాధించారు. 7.1 ఓవర్లలోనే… 65 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది టీమిండియా. ఇక టీమిండియా ఓపెనర్ గొంగడి త్రిష 31 బంతుల్లో 40 పరుగులు చేసి దుమ్ము లేపింది. ఇందులో ఎనిమిది ఫోర్లు కూడా ఉన్నాయి. అటు కమలిని… మూడు పరుగులకే వెనుదిరిగింది.
AlsoRead:Rohit Sharma: ఆ బౌలర్ ను టార్చర్ చేస్తున్న రోహిత్…ఇది పద్దతేనా హిట్ మ్యాన్ ?
అనంతరం బ్యాటింగ్కు దిగిన సైనిక అలాగే నికి ప్రసాద్… టీమిండియా కు విజయాన్ని అందించారు. దీంతో ఈ టోర్నమెంట్ లో వరుసగా మూడు విజయాలను నమోదు చేసుకొని పాయింట్స్ టేబుల్ లో… అగ్రస్థానానికి చేరుకుంది టీం ఇండియా. గ్రూప్ ఎ లో ఆస్ట్రేలియా జట్టును వెనక్కి నెట్టి మరి… టాప్ లోకి వెళ్ళింది మహిళల టీమిండియా.ఇది ఇలా ఉండగా… ఈ టోర్నమెంట్ లో టీమిండియా తదుపరి మ్యాచ్… ఎల్లుండి జరగనుంది. అంటే ఈ నెల 28వ తేదీన అండర్ 19 స్కాట్లాండ్ మహిళల జట్టుతో… గ్రూప్ లెవెల్ మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా. ఈ మ్యాచ్ కూడా ఓవెల్ వేదికగా జరగనుంది.