Mohan Babu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు మోహన్ బాబు (Mohan Babu). ముఖ్యంగా స్వర్గీయ దర్శకులు దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) తర్వాత ఇండస్ట్రీకి అండగా నిలవాలనుకున్నారు. ఇప్పటికీ తాను ఇండస్ట్రీకి పెద్దగా అని ఆయన చెప్పుకుంటున్నా కానీ ఆయన చేసిన పనులు ఎక్కడా కూడా కనిపించలేదు. దీంతో అప్పుడప్పుడు మంచు మోహన్ బాబుపై ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. దీనికి తోడు ఈయన కొడుకులు గొడవ పడుతూ మీడియా కంట పడడంతో మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు ఉన్నాయనే వార్తలు తెరపైకి వచ్చాయి.
ఆస్తుల కోసమే అసలైన తగాదా..
అయితే అన్నదమ్ముల మధ్య తగాదాలు సహజమే అని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు ఏకంగా లెజెండ్రీ నటుడు మోహన్ బాబు రంగంలోకి దిగడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మోహన్ బాబు పెద్దకొడుకు మంచు విష్ణు(Manchu Vishnu)తో కలిసి చిన్న కొడుకు మనోజ్(Manoj )పై దాడికి దిగారు అనే వార్తలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంచు విష్ణు దుబాయ్ లో ఉండగా.. రెండు రోజుల క్రితం మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబుతో గొడవపడ్డారని, ఆ సమయంలో మోహన్ బాబు సిబ్బంది మనోజ్ పై దాడి చేశారని సమాచారం. ఇకపోతే తనపై మోహన్ బాబు అనుచరులు పదిమంది దాడి చేసినా.. తన తండ్రి పేరు కానీ, కుటుంబ సభ్యుల పేరు కానీ బయటకు తీయకుండా తనపై గుర్తుతెలియని వ్యక్తులు పదిమంది దాడి చేశారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మనోజ్.
మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత..
అయితే మోహన్ బాబు మాత్రం అదే రోజు రాత్రి 11 సమయంలో వాట్సప్ ద్వారా తనకు కోడలు మౌనిక, కొడుకు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని, రక్షించాలని కోరగా వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపోతే తన కుటుంబ సభ్యులే తనకు నష్టం కలిగించారని, వారి నుంచి రక్షణ కావాలని అధికారులను కలిశారు మనోజ్ దంపతులు. మరోవైపు మనోజ్ దంపతులు తమ పాపను తీసుకోవడానికి మోహన్ బాబు ఇంటికి వెళ్ళగా.. సిబ్బంది లోపలికి రానివ్వకపోవడంతో కాసేపు వెయిట్ చేసి, కుదరకపోవడంతో గేట్లు బద్దలు కొట్టుకొని మరి లోపలికి వెళ్లారు. ఇక మీడియా మిత్రులు ఫోటోలు, వీడియోలు తీస్తున్న నేపథ్యంలో వీరిపై మోహన్ బాబు దాడి చేయగా.. ఇద్దరు మీడియా మిత్రులకు గాయాలయ్యాయి. దీనిపై మండిపడ్డ జర్నలిస్టు సంఘాలు హత్యాయత్నం కింద కేసు ఫైల్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో మోహన్ బాబుపై పెరుగుతున్న వ్యతిరేకత..
ఇక ఇలా ఒకదాని తర్వాత ఒకటి కారణంగా మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ వార్తల్లో నిలుస్తుండడంతో తాజాగా కొన్ని మీడియా ఛానల్స్ పోల్ నిర్వహించాయి. మంచు ఫ్యామిలీలో గొడవలు.. ఇందులో ఎవరిది తప్పు అని అనుకుంటున్నారు? అని పోల్ నిర్వహించగా అందరూ కూడా మోహన్ బాబుదే తప్పు అని కామెంట్లు చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో అసలైన రచ్చ మొదలయ్యింది. పూర్తిస్థాయిలో మోహన్ బాబుకు వ్యతిరేకత ఏర్పడింది. అటు నెటిజన్స్ కూడా ఈయనకు నెగిటివ్ గా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఆస్తుల విషయంలోనే ఈ గొడవలు వచ్చినట్లు తెలుస్తూ ఉండగా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మోహన్ బాబు పై వ్యతిరేకత బాగా పెరిగిపోతోంది.