Manchu Family Issues: మంచు కుటుంబ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. మోహన్ బాబు ఇంటివద్ద ఉద్రిక్తత సద్దుమణిగింది. తన కూతురును తనకు చూపించాలని మనోజ్.. మోహన్ బాబు ఇంటివద్ద రచ్చ చేశాడు. లోపలికి వెళ్లనివ్వలేదని గేట్లు బద్దలుకొట్టి మరీ వెళ్లి.. బౌన్సర్లతో తన్నుకు తిన్నాడు. ఇంకోపక్క మోహన్ బాబు మీడియాపై మండిపడ్డాడు. చేతిలో మైక్ ను మీడియా ప్రతినిధి మీదకు విసరి రౌడీయిజం చూపించాడు.
ఇక ఈ నేపథ్యంలోనే ఆయనకు బిపి ఎక్కువ అవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే మనోజ్ తల్లి హాస్పిటల్ లోనే ఉంది. ఈ రెండు చాలవు అన్నట్లు తాజాగా మంచు మోహన్ బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం సంచలనం సృష్టిస్తుంది, నేటి ఉదయం ఆమె.. మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగిందో మీడియా ముందు చెప్పింది.
ఆమె చెప్పిన విషయాలు వలన మీడియాలో ఇంకాస్తా వైరల్ గా మారాయి. దీంతో ఈ గొడవల వలన తనను ఎక్కడ ఇరికిస్తారో.. ? తనకు జరగరానిది ఏదైనా జరుగుతుందేమో అని భావించి ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను సైతం చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చేర్చినట్లు తెలుస్తోంది.
ఇక ఆ వీడియోలో పనిమనిషి ఏం చెప్పిందంటే.. ” మోహన్ బాబు అనుచరుల్లో ఒకరితో వ్యాపారం విషయంలో మనోజ్‌కు గొడవ మొదలయ్యింది. అదే క్రమంలో మనోజ్‌కు వెనక్కి తోశారు. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇదంతా శనివారం జరిగింది. తర్వాత రోజు మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవ మొదలయ్యింది. ఇందులో ఎవ్వరికీ ఎక్కువగా దెబ్బలు తగల్లేదు.
అన్నదమ్ములకు, తండ్రీకొడుకులకు మధ్య కొన్ని పాత గొడవలు ఉన్నాయి. మౌనికకు ముందే బాబు ఉన్నాడు కాబట్టి తనను మనోజ్ పెళ్లి చేసుకోవడం వారికి మొదటి నుండి ఇష్టం లేదు. మంచు లక్ష్మి వచ్చి కూడా వారికి సర్ధిచెప్పడానికి ప్రయత్నించింది. తండ్రిపై మనోజ్ చేయి చేసుకున్నాడు” అంటూ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.