Box office: ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని పెంచేలా దర్శకులు, హీరోయిన్లు, హీరోలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే యంగ్ హీరో, హీరోయిన్లు కూడా భారీ బడ్జెట్ సినిమాలో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక సంస్థ డిసెంబర్ 2024 వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ ఎవరంటూ ఒక సర్వే నిర్వహించగా.. అందులో సమంత(Samantha)టాప్లో నిలిచింది. మరి మిగతా తొమ్మిది స్థానాలలో ఉన్న హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
సమంత..
టాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది సమంత (Samantha). ‘ఏ మాయ చేసావే’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. అందం, అభినయంతో అందరిని ఆకట్టుకుంది. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకున్న సమంత, ఇండియాలో మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ లో మొదటి స్థానంలో నిలిచింది.
అలియా భట్..
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీగా పేరు దక్కించుకున్న ఈమె.. రాజమౌళి(Rajamouli)దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR ), రామ్ చరణ్ (Ram charan ) కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నటించి తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. అలియా భట్ టాప్ టెన్ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది.
దీపికా పదుకొనే..
ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రభాస్ (Prabhas)హీరోగా నటించిన ‘కల్కి 2898AD’ సినిమాతో గత ఏడాది తెలుగు ప్రేక్షకులను పలకరించిన దీపికా పదుకొనే (Deepika padukone)మూడవ స్థానంలో నిలిచింది.
రష్మిక మందన్న..
గత ఏడాది డిసెంబర్ ఐదవ తేదీన అల్లు అర్జున్ (Allu arjun), హీరోగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో విడుదలైన చిత్రం ‘పుష్ప 2’. ఇందులో రష్మిక మందన్న(Rashmika mandanna)హీరోయిన్గా నటించింది. అతి తక్కువ సమయంలోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1850 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇందులో హీరోయిన్ గా నటించిన రష్మికకు నాల్గవ స్థానం లభించింది.
సాయి పల్లవి..
ఇటీవల మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అమరన్’. భారీ అంజనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా ద్వారా సాయి పల్లవి అంతే ఇమేజ్ సొంతం చేసుకుంది. మరొకవైపు హిందీలో రామాయణం సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈమె లుక్కుకు సంబంధించిన పలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో భారీ పాపులారిటీ అందుకున్న సాయి పల్లవి ఐదవ స్థానాన్ని దక్కించుకుంది.
ఇక వీరితోపాటు ఆరవ స్థానంలో త్రిష (Trisha ), ఏడవ స్థానంలో నయనతార (Nayanthara), ఎనిమిదవ స్థానంలో కాజల్ అగర్వాల్ (Kajal agarwal ), తొమ్మిదవ స్థానంలో శ్రీ లీల (Sreeleela), పదవ స్థానంలో శ్రద్ధ కపూర్(Shraddha kapoor )నిలిచారు. ఏది ఏమైనా వీరంతా కూడా తమ సినిమాలతో మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ గా పేరు దక్కించుకోవడం ప్రశంసనీయమని చెప్పవచ్చు. అలా తమ నటనతోనే కాదు అందంతో కూడా ఆకట్టుకుంటున్నారు ఈ హీరోయిన్స్.