Ananthapur News: నేను మారాను.. మీరు మారండి.. లేదంటే 1996 సీఎంను చూస్తారని పదే పదే అధికారులను హెచ్చరిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అయినా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడలేదు. అందుకు ఎగ్జాంఫుల్ అనంతపురం జిల్లా రెవిన్యూ అధికారి. ఓ వైపు కమిషన్ ఛైర్మన్ మీటింగ్ జరుగుతుండగా, ఆయన మాత్రం రాణి, జాకీ, ఆసు గేమ్‌లో నిమగ్నమయ్యారు ఈ పేకాట పాపారావు.
ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తోంది. జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు జిల్లా రెవిన్యూ అధికారి మలోల స్వాగతం పలికారు. ఆ తర్వాత రెవెన్యూ భవన్‌లో ఛైర్మన్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, జాయింట్ కలెక్టర్లు హాజరయ్యారు.
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం- అనుకూలం వర్గాలకు చెందిన ప్రజలు తరలివచ్చారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు అక్కడికి వచ్చారు. రెవెన్యూ భవన్ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే ఈ సమావేశం తనకు ఏమాత్రం సంబంధ లేదని భావించారాయన. కమిషన్ ఛైర్మన్‌కు కూతవేటు దూరంలో కూర్చొన్నారు.
ఇంత జరుగుతున్నా జిల్లా రెవిన్యూ అధికారి-డిఆర్ఓ మల్లాల తనకు ఏమీ పట్టనట్టు వ్యవహరించారు. జేబులోని తన స్మార్ట్ ఫోన్ బయటకు తీసి ఆన్ చేసి హాయిగా రమ్మీ ఆడుతూ బిజి బిజీగా కనిపించారు. రాణి-జాకీ-ఆసుల ప్రపంచంలో మునిగిపోయారు. తనవైపు ఎవరైనా చూస్తున్నారా భావించి.. ఆట మధ్యలో అటు ఇటు చూడడం మొదలుపెట్టారు.
ALSO READ: దావోస్ వెళ్లి చేసిందా ఇదా? చంద్రబాబు టీమ్‌పై అంబటి సెటైర్లు
దీనికి సంబంధించి అధికారి వెనకున్న మరొకరు ఈ తతంగాన్ని తన ఫోన్‌లో రికార్డు చేశారు. మలోల వ్యవహారంపై విమర్శలు తీవ్రమయ్యాయి. తన కార్యాలయంలో డీఆర్వో మలోల పేకాట ఆడటమే పనిగా పెట్టుకున్నారన్నది కొందరు కలెక్టరేట్ ఉద్యోగుల మాట. ఆయనపై పైస్థాయి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
మరోవైపు కలెక్టర్ పక్కనే రమ్మీ ఆడిన డీఆర్ఓ మలోలపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సీరియస్ అయ్యారు. మలోలపై అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఉన్నతాధికారుల పక్కన పెట్టుకొని రమ్మీ గేమ్ ఆడటంపై సీరియస్ అయ్యారు. DRO మలోలపై ఇదివరకే ఇలాంటి ఆరోపణలున్నాయి. దీంతో DRO మలోలపై చర్యలకు సిఫార్సు చేసే అవకాశమున్నట్లు కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి.
అనంతపురం: ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ.
👉కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్‌లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం.
👉ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా, వ్యతిరేకంగా వినతి పత్రాలు ఇచ్చేందుకు వచ్చిన పలు సంఘాలను పట్టించుకోకుండా రమ్మీ… pic.twitter.com/YU1IfFrbhe— ChotaNews App (@ChotaNewsApp) January 21, 2025