1996లో ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎస్. శంకర్ (S.Shankar) దర్శకత్వంలో విడుదలైన చిత్రం భారతీయుడు(Indian)..కమలహాసన్(Kamalhassan) హీరోగా, మనిషా కొయిరాలా(Manisha koirala), ఊర్మిల(Urmila), సుకన్య(Sukhanya)తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకి ఏ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించిన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా కమలహాసన్, శంకర్ కాంబోకి విపరీతమైన క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందని ప్రకటించారు. కానీ ఆ విషయం పై ఎప్పుడు కూడా డైరెక్టర్ కానీ , కమల్ హాసన్ కానీ ప్రకటించలేదు. కానీ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ సినిమా.
నేరుగా ఓటీటీలో విడుదలైన ఇండియన్ 2..
అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎన్నోసార్లు ఆగిపోయింది అని చెప్పాలి..ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ శంకర్ మరొకవైపు తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ ప్రారంభించారు. దీనికి తోడు అటు కమలహాసన్ తో చిన్నపాటి విభేదాలు ఉండడం వల్లే సినిమా షూటింగ్ ఆగిపోయిందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఎట్టకేలకు ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలో కాకుండా నేరుగా 2024 ఆగస్టు 15వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. ఇకపోతే ఓటీటీలో విడుదలైన సరే ఈ సినిమా ఘోర పరాభవాన్ని చవిచూసింది. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మానందం తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించగా.. రవి వర్మన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.
థియేటర్లలో విడుదల కానున్న ఇండియన్ 3
ఇకపోతే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే ఆమె ఇండియన్ ఫ్రాంచైజీ లో భాగమైంది. కానీ ఇండియన్ 3 లో నటించడం లేదని చివర్లో ట్విస్ట్ రివీల్ చేశారు మేకర్స్. దీనికి తోడు సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులకు మెప్పించలేదనే వార్తలు వినిపించాయి. అలా ఎన్నో అంచనాల మధ్య సినిమా విడుదలవడంతో ఘోర పరాభవాన్ని చవిచూసింది. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. ఇండియన్ 3 సినిమాను కూడా విడుదల చేస్తామని ప్రకటించడం గమనార్హం. అయితే దీనిని కూడా ఓటీటీ లోనే విడుదల చేస్తారని అందరూ అంటుండగా.. తాజాగా చిత్రదర్శకుడు శంకర్ ఊహించని కామెంట్లు చేశారు..ఆయన మాట్లాడుతూ..” ఇండియన్ 2 ని ఓటీటీలో విడుదల చేసి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా ఇంత నెగిటివిటీ వస్తుందని నేను ఊహించలేదు. అందుకే ఇండియన్ 3 సినిమాను ఓటీటీలో కాకుండా నేరుగా థియేటర్లలోని విడుదల చేస్తాము” అంటూ డైరెక్టర్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ఈ సినిమాని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 24వ తేదీన థియేటర్లలోకి విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇందుకు సంబంధించిన ఒక వీడియోని కూడా విడుదల చేశారు మేకర్స్. అందులో కాజల్ అగర్వాల్ కత్తి పట్టి మగధీర సినిమాను మరోసారి గుర్తు చేసిందని నెటిజెన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇండియన్ 3 ఇప్పుడు థియేటర్లలో రాబోతుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.