Aparna Malladi: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ లేడీ డైరెక్టర్ అపర్ణ మల్లాది(54) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న అపర్ణ.. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. మొదట చికిత్సకు సహకరించిన ఆమె శరీరం ఉన్నా కొద్దీ సహకరించడం మానేసింది. దీంతో మళ్లీ క్యాన్సర్ పెరగడంతో ఆమె మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఇక అపర్ణ మృతితో టాలీవుడ్ లో విషాదం నెలకొంది.
Upasana Singh: ఆ సౌత్ డైరెక్టర్ హోటల్ రూమ్ కు రమ్మన్నాడు… ఉపాసన షాకింగ్ కామెంట్స్
అపర్ణ మల్లాది కేవలం డైరెక్టర్ మాత్రమే కాకుండా సినీ రచయితగా, నిర్మాతగా కూడా వ్యవహారించారు. ది అనుశ్రీ ఎక్స్ పెరిమెంట్స్ అనే సినిమాతో ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక కొద్దిగా గ్యాప్ తీసుకొని పోష్ పోరిస్ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు అపర్ణ. ఓటీటీలు అందుబాటులోకి రాకముందే వెబ్ సిరీస్ ను తెరకెక్కించి యూట్యూబ్ లో రిలీజ్ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.
ఇక రెండేళ్ల క్రితం పెళ్లి కూతురు పార్టీ అనే సిరీస్ తో ప్రేక్షకులముందుకు వచ్చారు అపర్ణ. ఈ సిరీస్ ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ తరువాత ఆమె క్యాన్సర్ బారిన పడ్డారు. ఇక దీంతో చికిత్స కోసం అమెరికాకు వెళ్లిపోయారు. క్యాన్సర్ ను జయించలేక అపర్ణ మృత్యువాత పడ్డారు. చిన్న వయస్సులోనే ఆమె మృతి చెందడం ఇండస్ట్రీకి తీరని లోటని సినీ పెద్దలు చెప్పుకొస్తున్నారు.
Pushpa 2: అల్లు అర్జున్ నట విశ్వరూపం.. గంగో రేణుకా తల్లి వీడియో సాంగ్ వచ్చేసింది
అపర్ణ చేసినవి తక్కువ సినిమాలే అయినా.. ఇండస్ట్రీకి కొత్తవారిని పరిచయం చేయడంలో ఆమె ముందు ఉండేవారు. కేరాఫ్ కంచరపాలెం లాంటి అవార్డు విన్నింగ్ సినిమాలకు తెరపై రావడానికి అపర్ణ ఎంతో దోహహదపడ్డారు. ఆమె తన దర్శకత్వ నైపుణ్యాలను.. విద్యార్థులకు నేర్పడం ద్వారా వారికి ప్రేరణగా నిలిచారు. ఇక అపర్ణ మృతిపట్ల సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
క్యాన్సర్ మహమ్మారి ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంటుంది . ముఖ్యంగా ఇండస్ట్రీలో ఈ క్యాన్సర్ వలన ఎంతోమంది సెలబ్రిటీలు మృత్యువాత పడ్డారు. అక్కినేని నాగేశ్వరావు, రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఇలాచాలామంది క్యాన్సర్ తోనే మృతి చెందారు. ఇక క్యాన్సర్ ను జయించి జీవితాన్ని కొనసాగిస్తున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. కానీ అతి చిన్న వయస్సులోనే అపర్ణ మరణించడం అనేది వారి కుటుంబానికి ఎంతో పెద్ద విషాదమని నెటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.