Rajamouli: రామ్ చరణ్ (Ram Charan), రాజమౌళి(Rajamouli) మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. వీరి కాంబోలో ఇప్పటికే ‘మగధీర’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి రెండు బిగ్గెస్ట్ సినిమాలు వచ్చాయి. ఇక మగధీర సినిమాతో రామ్ చరణ్ హీరోయిజాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది రాజమౌళి అనే చెప్పుకోవచ్చు. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రాంచరణ్ ని గ్లోబల్ స్టార్ ని చేసింది కూడా రాజమౌళినే. అలా రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభతో ఎంతోమంది హీరోలను గ్లోబల్ రేంజ్ లో పాన్ ఇండియా హీరోలుగా తయారు చేస్తున్నారు. అయితే అలాంటి రాజమౌళి తాజాగా ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చి ట్రైలర్ ని లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే.
రామ్ చరణ్ కి వార్నింగ్ ఇచ్చిన జక్కన్న..
ఇక ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ఉండే ఏఎంబి మాల్ లో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళితో పాటూ చిత్ర డైరెక్టర్, నిర్మాత, సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లు, ఆర్టిస్ట్ లు వచ్చారు.అయితే ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన రాజమౌళి లైవ్ లోనే రామ్ చరణ్ కి వార్నింగ్ ఇచ్చారు. మరి ఇంతకీ రామ్ చరణ్ కి రాజమౌళి ఎందుకు వార్నింగ్ ఇచ్చారో.. ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..
నా పర్మీషన్ తప్పనిసరి అంటూ కామెంట్..
గేమ్ ఛేంజర్ సినిమాలో రాజమౌళి వైట్ హార్స్ పై హార్స్ రైడింగ్ చేసే సీన్ ఒకటి ఉంటుంది.అయితే ఈ సీన్ చూసి రాజమౌళి మాట్లాడుతూ.. హార్స్ రైడింగ్ చేయాలంటే ముందు నా పర్మిషన్ తీసుకోవాలి.. నా పర్మిషన్ లేకుండా నువ్వు హార్స్ రైడింగ్ చేయకూడదు. హార్స్ రైడింగ్ చేసే రైట్స్ పూర్తిగా నావే అని నాకు ఓ పేపర్ మీద రాసివ్వు అంటూ రాంచరణ్ కి నవ్వుతూ వార్నింగ్ ఇచ్చారు రాజమౌళి. ఇక రాంచరణ్ ని రాజమౌళి అలా అనడానికి కారణం మగధీర సినిమాలో రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. మొదటిసారి రామ్ చరణ్ మగధీర సినిమాలోనే హార్స్ రైడింగ్ చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చేయడం సినిమాకి పెద్ద ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే మగధీర మాత్రమే కాకుండా ఆర్ఆర్ఆర్ మూవీలో కూడా రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చేసే సీన్ ని రాజమౌళి చూపించారు. అలా రామ్ చరణ్ వేరే సినిమాలకు హార్స్ రైడింగ్ చేయాలంటే తన పర్మిషన్ ఉండాలి అనే విధంగా ఫన్నీగా ఈ విషయాన్ని స్టేజిపై చెప్పారు రాజమౌళి.
శంకర్ కు సారీ చెప్పిన జక్కన్న..
అలాగే ఈ మాటలు మాట్లాడాక డైరెక్టర్ శంకర్ కి కూడా సారీ సార్ అంటూ చెప్పారు రాజమౌళి. ఈ ఈవెంట్లో శంకర్ గురించి జక్కన్న మాట్లాడుతూ.. డైరెక్టర్ శంకర్ మాకు ఒక పెద్ద ఓజీ లాంటివారు. ఆయన వల్లే మేము పాన్ ఇండియా సినిమాలు తీయగలుగుతున్నాం. పాన్ ఇండియా సినిమాలు అంటే ఏంటో తెలియని టైం లోనే ఈయన ఇండియా గర్వించదగ్గ ఎన్నో సినిమాలు తీశారు. ఈయన తీసిన సినిమాలో నాకు ఒకే ఒక్కడు సినిమా అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో హీరో అర్జున్ ముందు ఒక అవిటివాడు కూర్చొని.. “ఈ దేశం నాలాగే అవిటిది అయిపోయింది.మీరు నాయకుడు లాగా ముందుండి నడిపించండి” అని చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ వచ్చాయి. ఈ డైలాగ్ ఇప్పటికి కూడా నాకు చాలా నచ్చుతుంది. ఇక గేమ్ ఛేంజర్ ట్రైలర్ చూశాక.. రామ్ చరణ్ హెలికాప్టర్ నుండి కత్తి పట్టుకొని దూకే సన్నివేశం నాకు గూస్ బంప్స్ తెప్పించాయి.కత్తి పట్టుకొని గూస్ బంప్స్ తెప్పించగలడు. ఫోన్ పట్టుకొని ఏడిపించగలడు. చరణ్ సత్తా అలాంటిది అంటూ గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో రాంచరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజమౌళి. ఇక రాజమౌళి ఈ ఈవెంట్లో హార్స్ రైడింగ్ కి నా పర్మిషన్ తీసుకోవాలి అంటూ రాంచరణ్ కి చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఎంతైనా రాజమౌళి చెప్పిందే నిజం.. డైరెక్టర్ శంకర్ గారు ఈ విషయంలో ఫీలయిన పరవాలేదు. ఎందుకంటే రామ్ చరణ్ రాజమౌళి హార్స్ రైడింగ్ ఒక డెడ్లీ కాంబినేషన్ అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇక గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న విడుదల కాబోతోంది.