BigTV English

Indraja Bye to Jabardasth Show: జబర్దస్త్ కు ఇంద్రజ బ్రేక్.. కన్నీళ్లతో సెండాఫ్ ఇచ్చిన టీమ్..!

Indraja Bye to Jabardasth Show: జబర్దస్త్ కు ఇంద్రజ బ్రేక్.. కన్నీళ్లతో సెండాఫ్ ఇచ్చిన టీమ్..!

Indraja Taking Break to Jabardasth Comedy Show: సీనియర్ నటి ఇంద్రజ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా ఆమె ఎంతో గుర్తింపును తెచ్చుకుంది. పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె జబర్దస్త్ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. రోజాకు అప్పుడే మినిస్టర్ పదవి రావడంతో ఆమె జడ్జి నుంచి తప్పుకుంది. ఇక రోజా తరువాత అంతలా అభిమానులను మెప్పించే జడ్జి ఎవరు వస్తారా.. ? అనుకున్న సమయంలో ఇంద్రజ వచ్చింది.


మొదట్లో కొద్దిగా మొహమాటంతోనే జడ్జిమెంట్ ఇచ్చేది. కానీ, ఉన్నకొద్దీ ఆమె కూడా తనకు నచ్చితేనే మార్కులు ఇవ్వడం మొదలుపెట్టింది. అలా జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా జడ్జిగా మారింది. ఒకపక్క షోస్ చేస్తూనే ఇంకోపక్క సినిమాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. ముఖ్యంగా జబర్దస్త్ కంటెస్టెంట్స్ కు ఏదైనా డబ్బు సాయం చేయాలంటే ఇంద్రజ ముందు ఉంటుంది. అందుకే కంటెస్టెంట్స్ అందరూ ఆమెను ఇంద్రజమ్మ అని పిలుస్తారు.

అందం, అభినయంతో అలరిస్తున్న ఇంద్రజ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. జబర్దస్త్ కు ఆమె బ్రేక్ తీసుకోకున్నట్లు తెలిపి షాక్ ఇచ్చింది. తాజాగా జబర్దస్త్ ప్రోమోలో ఇంద్రజ.. స్టేజిని వదిలి వెళ్లలేక ఎమోషనల్ అయ్యిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. జబర్దస్త్ లో ఒక చిన్న గ్యాప్ అయితే తీసుకుంటున్నాను.. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.


Also Read: Rashmika Mandanna: విజయ్ తో పెళ్లి ఫిక్స్.. ఎట్టకేలకు బయటపెట్టిన రష్మిక.. ?

అయితే ఆమె ఎందుకు ఈ గ్యాప్ తీసుకుంటుందో మాత్రం చెప్పలేదు. ఏదైనా సమస్యనా.. ? లేక సినిమాలు ఎక్కువ వచ్చాయా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇంద్రజ వెళ్ళిపోతుందని తెలియడంతో జబర్దస్త్ టీమ్ కూడా కంటతడి పెట్టింది. అందరూ ఇంద్రజమ్మతో కలిసి ఫోటో తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఇంద్రజ వెళ్ళిపోతే ఆ ప్లేస్ ను రీప్లేస్ చేయడానికీ మల్లెమాల ఏ హీరోయిన్ ను తీసుకొస్తుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×