BigTV English

Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఇదిగో వీడియో

Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఇదిగో వీడియో

Kiren Rijiju: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు లద్దాఖ్ లో మంత్రి కాన్వాయ్‌కి ముందు వాహనం నదిలో పడిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నుంచి మంత్రి తృటిలో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన  వీడియోను మంత్రి ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రమాదం జరిగినప్పుడు ఆ కాన్వాయ్ సమయానికి వెళ్లిందని రాసుకొచ్చారు. అక్కడ చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా  కాపాడారని ఆయన పోస్ట్ చేశారు.


ALSO READ: Weather News: రాష్ట్రానికి బిగ్ రెయిన్ అలర్ట్.. నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతవాసులు జాగ్రత్త..!

లద్దాఖ్ లో నదిలో పడిపోయిన ట్రక్కు పైన ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. వారిని రక్షించడానికి సహాయక చర్యలు జరుగుతుండగా కేంద్ర మంత్రి కిరణ్ ,ఆయన భద్రతా సిబ్బంది రోడ్డు పక్కన కనిపిస్తున్నారు.


ALSO READ: Jobs in Indian Railway: గోల్డెన్ ఛాన్స్.. రైల్వేలో 3518 అప్రెంటీస్ పోస్టులు, ఇదే మంచి అవకాశం

కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ట్విట్టర్ లో ఈ వీడియోను  షేర్ చేస్తూ ఇలా రాశారు. లద్దాఖ్ లోని ద్రాస్ సమీపంలో ఓ వాహనం మా కాన్వాయ్ కంటే కొంచెం ముందు నదిలో పడిపోయింది. అదృష్టవశాత్తూ మేము సమయానికి వచ్చాం.. ఈ ప్రమాదంలో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. అని కిరెన్ రిజిజు ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.

Related News

Jammu Kashmir: భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు, స్పాట్‌లో ఐదుగురు మృతి

Crime: భార్యలను చంపుతున్న భర్తలు.. అసలు కథ ఇదే..!

Anantapur News: అనంతలో ట్రయాంగిల్‌ లవ్‌‌.. ప్రియురాలి బెదిరింపులు, మరో యువతి సూసైడ్

Medipally News: కాళ్లు, చేతులు, తల లేకుండానే స్వాతి అంత్యక్రియలు..

Hyderabad News: నడిరోడ్డుపై రెచ్చిపోయారు.. క్రికెట్ బ్యాట్‌తో బైకర్స్‌పై దాడి చేసి, మేటరేంటి?

Big Stories

×