
Sai DharamTej: తెరపై ‘సోలో బ్రతుకే సో బెటర్’ అన్నాడు. తెరవెనుక మాత్రం ‘పిల్ల నువ్వులేని జీవితం’ అంటాడు. పలువురితో ‘చిత్రలహరి’ పాడాడు. కానీ, ఏనాడూ కాలేదు ‘విన్నర్’. ఎంత ‘ఇంటిలిజెంట్’గా వ్యవహరించినా.. ‘తిక్క’ మాత్రం కుదిరేది ఎప్పటికప్పుడు. ఏ ‘నక్షత్రం’లో పుట్టాడో కానీ.. ‘జవాన్’లా ప్రేమ పోరాటం చేసినా.. ‘సుప్రీమ్’ హీరోలా ఫోజు కొట్టినా.. ‘తేజ్’కు లవ్ ‘రిపబ్లిక్’ మాత్రం దక్కలేదు. ఇదంతా ఆయన చెప్పిన హిస్టరీనే.
మెగా హీరో సాయిధరమ్ తేజ్.. ‘విరుపాక్ష’తో ముందుకొచ్చాడు. థ్రిల్లింగ్ హిట్ కొట్టాడు. అంతకుముందు వరుస ఇంటర్వ్యూల్లో తన కహానీ విడమరిచి చెప్పాడు. ఫస్ట్ క్రష్, తొలిప్రేమ, పెళ్లిల గురించి అనేక వివరాలు వెల్లడించాడు. చూట్టానికి కామ్ బాయ్‌గా కనిపించినా.. మనోడి ఫ్లాష్‌బ్యాక్‌లో అనేక ఇంట్రెస్టింగ్ ట్రాక్స్ ఉన్నాయ్.
ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఎవరో ఒకరైనా క్రష్ ఉంటారని.. తనకు ఒక నటిగా, మనిషిగా అట్రాక్ట్ చేసింది మాత్రం సమంతనే అని చెప్పాడు. రెజీనా, సయామి అంటే చాలా ఇష్టమన్నారు. ఎందుకంటే వాళ్లు తన ఫస్ట్ హీరోయిన్స్ అంటున్నాడు తేజ్.
ఇంటర్‌లో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించాడట. మొదట్లో వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత లవ్‌లో పడ్డారు. అమ్మాయి ఇంట్లో పెళ్లి సంబంధం చూశారు. అప్పటికి తనకెలాంటి జాబ్ కానీ, కెరీర్ కానీ లేకపోవడంతో పెళ్లికి వెనకడుగు వేశానని చెప్పాడు. తన ప్రేమను త్యాగం చేసి.. తానే దగ్గరుండి లవర్ పెట్టి చేశానన్నాడు సాయిధరమ్ తేజ్.
హీరో అయ్యాక.. ఓ హీరోయిన్‌తో లవ్‌లో పడ్డాడట. ‘తిక్క’లో తనకు జోడిగా నటించిన లారిస్సా బోనేసితో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నాడు. షూటింగ్ సమయంలోనే డొంకతిరుగుడు లేకుండా డైరెక్ట్‌గా ఆమెకు ప్రపోజ్ చేశాడట. నువ్వంటే నాకిష్టం.. డేటింగ్ చేద్దామా? అని అడిగేశాడట. అయితే, లారిస్సా మాత్రం సాయికి సారీ చెప్పింది. తనకు ఆల్రెడీ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడంటూ.. మనోడి హార్ట్ బ్రేక్ చేసేసింది. అందుకే ఇక అప్పటినుంచీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ.. ప్రేమా దోమా వద్దు ‘రేయ్’ అంటూ.. సింగిల్ స్టేటస్ మెయిన్‌టెన్ చేస్తున్నానని చెప్పాడు మెగా హీరో. మరి, పెళ్లెప్పుడని అడిగితే.. రాసి పెట్టి ఉంటే అవుతుంది అంటున్నాడు సాయి ధరమ్ తేజ్.