Big Stories

Csk vs Srh:- హైదరాబాద్ ఇక మారదా… చెన్నై చేతిలో ఓటమి

Csk vs Srh:- హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఈజీ విక్టరీ సాధించింది. సన్ రైజర్స్ జట్టు ఇచ్చిన 134 పరుగుల స్వల్ప  చేజింగ్‌ను కేవలం 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. డెవోన్ కాన్వే 57 బంతుల్లో 77 పరుగులు చేసి అదరగొట్టాడు. ఓపెనింగ్‌కు దిగిన రుతురాజ్ గైక్వాడ్ కూడా ఫర్వాలేదనిపించాడు. 30 బంతుల్లో 35 పరుగులు చేసి రన్ ఔట్ అయ్యాడు. అజింక్యా రహానే మళ్లీ ఫెయిల్ అయ్యాడు. 10 బాల్స్ లో 9 పరుగులే చేశాడు, మిగిలిన బ్యాట్స్ మెన్ కూడా కాన్వేకు సపోర్టుగా ఉన్నారే తప్ప పెద్దగా హిట్టింగ్‌కు దిగలేదు. ఈజీ టార్గెట్ కావడంతో.. ఎవరూ పెద్దగా ఆవేశ పడకుండానే ఆడారు. మొత్తానికి 18.4 ఓవర్లలోనే 134 పరుగుల లక్ష్యాన్ని చేధించారు.

అంతకు ముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ మొదటి 10 ఓవర్ల వరకు బాగానే ఆడింది. 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఆ తరువాత పది ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 62 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాని, చెన్నై ఆల్ రౌండర్ జడేజా 3 వికెట్లతో  మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. దీంతో 20 ఓవర్లలో 7  వికెట్లు కోల్పోయి కేవలం 134 పరుగులు మాత్రమే చేసింది. చెన్నైకి ఈజీ టార్గెట్ ఇచ్చింది.

- Advertisement -

ఓపెనర్ హర్రీ బ్రూక్ 18 పరుగులకే ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ నిలదొక్కుకున్నాడనుకునే సమయానికి 34 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.  ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి 21 పరుగులు చేయడం మినహా మిగతా వారెవరూ పెద్దగా రాణించలేదు.  చెన్నై బౌలర్లలో జడేజా 3 వికెట్లు, ఆకాష్ సింగ్, మహీష్  తీక్షాన, మతీషా పత్రినా తలో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News