Megastar 156 movie : మెగా 156 .. టైటిల్ ఫిక్స్ ..

Megastar 156 movie : మెగా 156 .. టైటిల్ ఫిక్స్ ..

megastar 156 movie
Share this post with your friends

megastar 156 movie

megastar 156 movie : మెగాస్టార్.. రీయంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి వరుస ప్రాజెక్టులతో బిజీగా మంచి బ్లాక్ బస్టర్ చిత్రాలు చేస్తూ రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాడు. మొదట్లో కాస్త తడబడిన వాల్తేరు వీరయ్య పుణ్యమా అని తిరిగి పూర్వపు క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక మెగా 156 మూవీ కోసం మెగాస్టార్ వినూత్నమైన టైటిల్ ని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య తో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న చిరు అదే పరంపర కంటిన్యూ చేయడం కోసం రాబోయే ప్రతి చిత్రంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని టాక్.

ఎందుకంటే వాల్తేరు వీరయ్య తర్వాత హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చిన భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అందుకే ఈసారి ఎలాగైనా బిగ్ సక్సెస్ ఖాతాలో వేసుకోవాలి అని మెగాస్టార్ మంచి పట్టుదల మీద ఉన్నారు. అందుకే టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో ‘బింబిసార’ లాంటి క్రేజీ మూవీ ని డైరెక్ట్ చేసిన మల్లిడి వశిష్టతో మెగా 156 సినిమాను చేయబోతున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ విడుదల చేసిన మెగా 156 పోస్టర్ కూడా విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది.

మెగాస్టార్ హీరోగా మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ తమ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్.. పంచభూతాలను ,ప్రళయాన్ని చూపిస్తూ మధ్యలో ఉద్భవించిన త్రిశూలాన్ని హైలైట్ చేసింది. అంటే రాబోయే చిత్రం మంచి సోషియో ఫాంటసీ జోనర్‌లో ఉంటుంది అని పరోక్షంగా పోస్టర్ ద్వారా కన్వే చేసారు. ఈ మూవీ ఒకప్పటి చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ టైప్ లో ఉంటుంది అని ప్రచారం జరుగుతుంది.

పైగా రీసెంట్ గా తమ మూవీకి సంబంధించిన ఎటువంటి కంటెంట్ కాపీ చేయడానికి వీలు లేదు అంటూ జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో ఒక లెటర్ ద్వారా తెలియపరిచారు. ఇది ఇన్ డైరెక్ట్ గా మెగా 156 ఉద్దేశించి ఇచ్చింది అని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఇక మెగా156 కథ విషయానికి వస్తే.. హీరో మూడు లోకాలను చుట్టివచ్చే వరాని పొందుతాడట.. అలా మూడు లోకాలకు వెళ్లి అతను ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేదే కథాంశం అంటూ ప్రచారం జరుగుతుంది.

 టాలీవుడ్ లో మంత్రాలు..మాయలు, లోకాలు ..విచిత్రాలు చూసి చాలా సంవత్సరాలు గడిచిపోతుంది. ఈ మూవీ నిజంగా ఇదే స్టోరీ తో వస్తే మాత్రం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అవుతుంది. ఈ చిత్రానికి ముల్లోకవీరుడు అనే టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ విశ్వంభరా అనే టైటిల్ ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తుంది. విశ్వంభరా అయితే అన్ని భాషల్లో కూడా ఒకే అర్థం వచ్చేట్టుగా పెట్టొచ్చు కాబట్టి ఈ టైటిల్ ని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసుకున్నట్లు తాజా సమాచారం. ఇంకా దీనిపై అధికారికంగా స్పష్టత రానప్పటికీ టైటిల్ అయితే మంచి పవర్ఫుల్ గా ఉంది అని అందరు అనుకుంటున్నారు. ఇక ఆ విషయం పక్కన పెడితే ఈ మూవీకి సుమారు 200 కోట్లకు పైగా బడ్జెట్ అని తెలుస్తుంది. మరోపక్క ఈ మూవీలో హీరోయిన్ గా అనుష్క శెట్టి ,విలన్ గా దగ్గుపాటి రానా ఫైనల్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. పవర్ ఫుల్ కాంబోలో వస్తున్న ఈ పవర్ ఫుల్ మూవీ ఎటువంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

ManojWedsMounika: వివాహబంధంలోకి మనోజ్, మౌనికారెడ్డి.. ఫొటోలు వైరల్

Bigtv Digital

Veera Simha Reddy Song: ప‌క్కా పండ‌గ సాంగ్ ఇచ్చేసిన బాల‌య్య‌… ‘మా బావ మ‌నోభావాల్ దెబ్బ‌తిన్నాయే’ సాంగ్ రివ్యూ

Bigtv Digital

Adipurush: ఓటీటీలో ఆదిపురుష్‌ బ్యాన్?

Bigtv Digital

Amitabh – Rajini : 32 ఏళ్ల త‌ర్వాత అమితాబ్‌తో త‌లైవా.. అపూర్వ క‌ల‌యిక‌

Bigtv Digital

Shahrukh condition to Ram Charan : రామ్ చ‌ర‌ణ్‌కి షారూఖ్ ఖాన్ కండీషన్‌

Bigtv Digital

Ajith Kumar: ఈసారి తెలుగు టైటిల్‌తో వ‌స్తున్న అజిత్‌

BigTv Desk

Leave a Comment