BigTV English

Co-parent in Laws Elope : కొడుకు మామగారితో పారిపోయిన మహిళ.. చివరికి ఏం జరిగిందంటే?

Co-parent in Laws Elope : ఒక మహిళ తన కొడుకు మామగారిని(Father in Law) ప్రేమించింది. సమాజం తమ ప్రేమను అంగీకరించదని తెలిసి వారిద్దరూ పారిపోయారు. ఆ తరువాత వారి కుటుంబాలలో గొడవలు మొదలయ్యాయి

Co-parent in Laws Elope : కొడుకు మామగారితో పారిపోయిన మహిళ.. చివరికి ఏం జరిగిందంటే?

Co-parent in Laws Elope : ఒక మహిళ తన కొడుకు మామగారిని(Father in Law) ప్రేమించింది. సమాజం తమ ప్రేమను అంగీకరించదని తెలిసి వారిద్దరూ పారిపోయారు. ఆ తరువాత వారి కుటుంబాలలో గొడవలు మొదలయ్యాయి. ఈ విషయం తెలిసిన ఆ ప్రేమికులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.


ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌కు చెందిన ఆశారాణి(41) అనే మహిళ కుటుంబంలో ఆమె భర్త, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మరోవైపు అదే ఊరికి చెందిన రామ్‌నివాస్ రాథోడ్‌(44)కు ఒక కుమార్తె ఉంది. అతని భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది.

ఇదిలా ఉండగా.. కొన్ని నెలల క్రితం రామ్‌నివాస్ రాథోడ్‌ ఒక కుమార్తెకు, ఆశారాణి కుమారుడికి వివాహం జరిగింది. అప్పటి నుంచి రామ్‌నివాస్ రాథోడ్‌ తన కూతురి అత్తగారింటికి తరుచూ వచ్చేవాడు. ఈ నేపథ్యంలో మధ్యవయస్కులైన రామ్‌నివాస్, ఆశారాణిల మధ్య ప్రేమ చిగురించింది.


ఆ తరువాత వారిద్దరూ ఒకరోజు ఇంటి నుంచి పారిపోయారు. తన భార్య కనపడడం లేదంటూ ఆశారాణి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేయగా.. రామ్‌నివాస్ రాథోడ్‌‌పై అనుమానం కలిగింది. అతని ఫోన్ నెంబర్ ట్రాక్ చేసి వారిద్దరినీ పట్టుకున్నారు. కానీ వారిద్దరూ మేజర్లు కావడం.. పైగా ఆశారాణి కూడా అతడిని ప్రేమిస్తోందని తెలిసి పోలీసులు ఏమీ చేయలేకపోయారు. కానీ ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి.

దీంతో రామ్‌నివాస్ రాథోడ్‌, ఆశారాణి తమ ప్రేమను గెలిపించుకునేందుకు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. వేగంగా వస్తున్న రైలు ముందుకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×