E-Paper
Advertisement

Alia Bhatt: చుట్టమల్లే.. ఎంత ముద్దుగా పాడావ్ అలియా.. ఫిదా అయిపోయాం

Alia Bhatt: చుట్టమల్లే.. ఎంత ముద్దుగా పాడావ్ అలియా.. ఫిదా అయిపోయాం
Advertisement

Alia Bhatt: బాలీవుడ్  బ్యూటీ అలియా భట్ గురించి తెలుగు ప్రేక్షకులకు  ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ.. సినిమాలో కొద్దిసేపు కనిపించినా కూడా  ప్రేక్షకులను తన అందంతో ఫిదా చేసింది. ఈ సినిమా తరువాత ఈ చిన్నది తెలుగులో మరో సినిమా  చేసింది లేదు.

ఇక బాలీవుడ్ రాకుమారుడు రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లాడిన  అలియా.. ప్రస్తుతం రాహాకు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. అలా అని  గృహిణిగా ఇంట్లోనే ఉండిపోలేదు. ప్రెగ్నెంట్ అప్పుడే ఈ చిన్నది షూటింగ్ లో పాల్గొంది. పెళ్లి తరువాత గ్లామర్ సినిమాలను తగ్గించి.. మంచి కథలను ఎంచుకుంటున్న అలియా..  తాజాగా జిగ్రా అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

ఇక జిగ్రా ప్రమోషన్స్ లో  దేవర కూడా భాగమయ్యాడు.  దేవర ప్రమోషన్స్ లో భాగంగా ముంబై వెళ్లిన  ఎన్టీఆర్.. అలియా, కరణ్ జోహార్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.  అలియా, ఎన్టీఆర్ కలిసి ఆర్ఆర్ఆర్  సినిమాలో నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో అద్భుతమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా అలియా.. చుట్టమల్లే సాంగ్ ను ఆలపించిన  విధానం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

దేవర  చిత్రంలో చుట్టమల్లే సాంగ్ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ సాంగ్ ను అలియా ఎంతో అద్భుతంగా ఆలపించింది. ఆమె వాయిస్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంఫండని చెప్పాలి. గతంలో  బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో కూడా అలియా.. తెలుగులో చక్కగా కుంకుమలా సాంగ్ ను ఆలపించింది.

Advertisement

తెలుగులో అలియా ముద్దు ముద్దుగా మాట్లాడమే కాకుండా ఇలా తెలుగు సాంగ్స్ ను పాడడం ఎంతో బావుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.  అలియా సాంగ్ కు ఎన్టీఆర్ సైతం ఫిదా అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు  సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి..   ఆర్ఆర్ఆర్ తరువాత  అలియా ఏ స్టార్ హీరో సినిమాతో తెలుగుకు రీఎంట్రీ ఇస్తుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×