E-Paper
Advertisement

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్‌కు సిద్ధమా? రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన తమన్

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్‌కు సిద్ధమా? రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన తమన్
Advertisement

Game Changer Movie Update: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ అందులో పనిచేసిన చాలామంది జీవితాలను మార్చేసింది. ముఖ్యంగా హీరోలుగా రామ్ చరణ్, ఎన్‌టీఆర్‌లకు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కేలా చేసింది. దీంతో ఈ హీరోల తర్వాతి సినిమాలపై ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్‌లో ఆసక్తి పెరిగింది. ఫైనల్‌గా మూడేళ్ల తర్వాత ఎన్‌టీఆర్ హీరోగా ‘దేవర’ అనే సినిమాతో థియేటర్లలో సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. కానీ రామ్ చరణ్ అప్‌కమింగ్ మూవీ గేమ్ ఛేంజర్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. ఫైనల్‌గా ఇప్పుడిప్పుడే రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను హ్యాపీ చేసే వార్తలు బయటికొస్తున్నాయి.

మరో అప్డేట్

Advertisement

తమిళ దర్శకుడు శంకర్‌తో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రమే ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా భారీ అంచనాల మధ్య షూటింగ్ ప్రారంభించుకుంది. దర్శకుడు శంకర్‌కు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. దాంతో రామ్ చరణ్‌తో ఆయన చేయబోయే సినిమా ఎలా ఉంటుందా అని ఆసక్తిగా చూడడం మొదలుపెట్టారు. ఇంతలోనే శంకర్.. సడెన్‌గా కమల్ హాసన్‌తో తెరకెక్కించే ‘ఇండియన్ 2’ వైపు షిఫ్ట్ అయ్యాడు. దాని తర్వాత ‘గేమ్ ఛేంజర్’పై ఫోకస్ చేస్తానని ఫ్యాన్స్‌కు మాటిచ్చినా కొన్నాళ్ల పాటు అసలు ఈ విషయంపై క్లారిటీనే లేదు. ఇన్నాళ్ల తర్వాత ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న తమన్.. రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను హ్యాపీ చేసే అప్డేట్‌తో వచ్చాడు.

Also Read: నార్త్ అమెరికాలో దుమ్మురేపుతున్న ‘దేవర’.. కొత్త రికార్డ్స్ సెట్ చేస్తోందిగా!

Advertisement

సాంగ్ రిలీజ్

‘గేమ్ ఛేంజర్’ మూవీ నుండి ఇప్పటివరకు పెద్దగా అప్డేట్స్ ఏమీ బయటికి రాలేదు. రామ్ చరణ్, కియారా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జరగండి’ పాట మాత్రమే విడుదలయ్యి ప్రేక్షకులను అలరించింది. ఫైనల్‌గా ఈ సినిమా నుండి రెండో పాట కూడా విడుదలకు సిద్ధమయ్యిందని కొన్నిరోజుల క్రితమే ఒక కొత్త పోస్టర్‌తో అనౌన్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్‌లో రెండో పాట విడుదల కానుందని ప్రకటించారు. కానీ ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్లారిటీ ఇవ్వడం కోసం తమన్ ముందుకొచ్చాడు. ‘సెప్టెంబర్ 25న గేమ్ ఛేంజర్ అనౌన్స్‌మెంట్. 2024 డిసెంబర్ 24న రిలీజ్’ అంటూ సాంగ్ రిలీజ్ డేట్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా యాడ్ చేశాడు తమన్.

‘పుష్ప 2’ కూడా అప్పుడే

తమన్ చేసిన ఈ ట్వీట్.. రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను ఫుల్ హ్యాపీ చేస్తోంది. మొత్తానికి అప్డేట్స్ రావడం, సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేయడంతో ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఆగిపోలేదని, రామ్ చరణ్‌ను త్వరలోనే స్క్రీన్‌పై చూసే అవకాశం లభిస్తుందని అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. మెగా ఫ్యాన్స్‌కు కూడా ఇది హ్యాపీ న్యూస్. ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ నుండి కూడా మరో సినిమా రాలేదు. డిసెంబర్ 6న ‘పుష్ప 2’ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఆ మూవీ విడుదలయిన కొన్నిరోజులకే ‘గేమ్ ఛేంజర్’ కూడా థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో కొన్నాళ్ల గ్యాప్‌లోనే చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×