BigTV English

AAYMovie: ఫంక్ పల్లవి.. పిల్లకు కొంచెం కుల పిచ్చి ఎక్కువ

AAYMovie: ఫంక్ పల్లవి.. పిల్లకు కొంచెం కుల పిచ్చి ఎక్కువ

AAYMovie: ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ మ్యాడ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న నితిన్ రెండో సినిమాను గీతా ఆర్ట్స్ లో ఆయ్ అనే సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. అంజి కె మణిపుత్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నితిన్ సరసన నయన్ సారిక నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఇక తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ ను పరిచయం చేస్తూ ఒక స్పెషల్ వీడియోను మేకర్స్ చేశారు. నయన్ సారిక.. ఫంక్ పల్లవి అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ వీడియోలో పల్లవి చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది. ఆమె ఇన్స్టా చుక్కగా చూపించారు. ” నన్ను ఫంక్ పల్లవి అంటారు.. నా హెయిర్ స్టైల్ ను ఈ ఊర్లోనే కాదు మా కాలేజ్ లోనే ఎవరు కాపీ చేయలేరు” అంటూ గలగలా మాట్లాడుతో కనిపించింది. అంతేకాకుండా కొద్దిగా కుల పిచ్చి ఉందని చెప్తూ హీరోలు, పొలిటీషియన్స్ గురించి కూడా చెప్పుకొచ్చింది.

కులమే మన బలం అనే పేరుతో గ్రూప్ క్రియేట్ చేసినట్లు చెప్పుకొచ్చి.. మన హీరో సినిమా నచ్చకపోయినా సూపర్ అనాలని.. వేరే హీరోల సినిమా నచ్చినా బాగోలేదని చెప్పాలని కల్ట్ ఫ్యాన్ లా చెప్పుకొచ్చింది. ఇక ఎలక్షన్ లో నిలబడినోడు మనోడు అయితేనే సపోర్ట్ చేయాలి. వాడికే మన గుద్దాలి. అదే మన అజెండా అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ అల్లరి పిల్లను హీరో ఎలా ప్రేమలో దింపుతాడు..? ఆమె ముక్కుకు ఎలా తాడు బిగిస్తాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నార్నే నితిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×