Akira Nandan:తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ(Mega Family) కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు అందరూ కూడా సూపర్ సక్సెస్ అందుకొని, ముందుకు సాగుతున్నారు. ఇకపోతే ఇప్పటివరకు వీళ్ళు సాధించిన విజయాలన్నీ కూడా వీరికి మంచి పేరు తీసుకొచ్చి పెట్టాయి. ఇదిలా ఉండగా ఈ ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలలో సక్సెస్ అయ్యి ఇప్పుడు రాజకీయాలలో కూడా బిజీ అయ్యారు. అందులో భాగంగానే ఆయన ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోని ఆయన నట వారసున్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆన్ స్క్రీన్ నేమ్ మార్చుకోబోతున్న అకీరా నందన్..
ఇప్పటికే అకీరా నందన్ (Akira Nandan)సినిమాకు సంబంధించి.. నటనలో ట్రైనింగ్ కూడా తీసుకుంటూ బిజీగా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు అకీరా నందన్ ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్ కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన ఖుషి(Khushi) సినిమా సీక్వెల్ ‘ఖుషీ2’ తీస్తానని ఇదివరకే ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ ఎస్ జె సూర్య (SJ.Surya) వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో అందరూ కూడా అకీరా ఖుషి 2 సినిమాతోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఇక ఇప్పుడు ఇండస్ట్రీకి రావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన పేరులో కూడా చిన్న చిన్న మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
పేర్లు మార్చుకున్న మెగా హీరోలు..
అసలు విషయంలోకి వెళ్తే.. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలంతా కూడా పేర్లు మార్చుకున్న విషయం తెలిసిందే.శివశంకర వరప్రసాద్ గా ఉన్న తన పేరును చిరంజీవి (Chiranjeevi)గా మార్చుకున్నారు మెగాస్టార్. నాగబాబు(Nagababu)కూడా నాగేంద్రబాబు గా ఉన్న తన పేరును నాగబాబుగా మార్చుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా అంతే.. తన పేరును కళ్యాణ్ నుండి పవన్ కళ్యాణ్ గా మార్చుకున్నారు. ఇక మరొకవైపు రామ్ చరణ్ తేజ్ (Ram Charan Tej) అయితే స్క్రీన్ నేమ్ రామ్ చరణ్ (Ram Charan)గా పెట్టుకున్నారు. ఇక రీసెంట్ గా సాయి ధరంతేజ్ (Sai Dharam Tej) కూడా తన పేరును సాయి దుర్గ తేజ్ గా మార్చుకోవడం జరిగింది. ఇక ఇదే క్రమంలో ఇప్పుడు ఇండస్ట్రీకి రాబోతున్న మరో యంగ్ మెగా హీరో అయిన అకీరా నందన్ కూడా తన పేరు మార్చుకోవడానికి సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అకీరా నందన్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు..
మరి అకీరా నందన్ అనే పేరును మొత్తానికి మారుస్తారా ? లేదంటే వెనుక, ముందు ఏదైనా యాడ్ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఇండస్ట్రీని ఏలడానికి మరొక మెగా హీరో ముందుకు వస్తుండడంతో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్, నేడు వరుస సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు. ఇప్పుడు అదే స్థాయిలో అకీరా పేరు సొంతం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి అకీరానందన్ కు సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇకపోతే ఈయన తల్లి రేణు దేశాయ్ (Renudesai ) కూడా అకిరా నందన్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.