BigTV English

RC16: చరణ్ కోసం మెగాస్టార్.. బుచ్చి ప్లాన్ మాములుగా లేదుగా.. ?

RC16: చరణ్ కోసం మెగాస్టార్.. బుచ్చి ప్లాన్ మాములుగా లేదుగా.. ?


RC16: ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత అందరి చూపు రామ్ చరణ్, ఎన్టీఆర్ మీదనే ఉంది. రాజమౌళితో సినిమా తరువాత ఏ హీరోకైనా ప్లాప్ తప్పదు అనేది సెంటిమెంట్ గా వస్తుంది. ఈసారి ఈ ఇద్దరు హీరోలు ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా.. ? లేక ఆ సెంటిమెంట్ కే బలవుతారా..? అని అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత ఈ ఇద్దరు హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ నే చేస్తున్నారు.

ఎన్టీఆర్ దేవర చేస్తుండగా.. చరణ్ గేమ్ ఛేంజర్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు చరణ్ లైన్లో RC16 కూడా ఉంది. ఉప్పెనతో భారీ హిట్ అందుకున్న బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ మధ్యనే RC16 పూజా కార్యకమ్రాలు కూడా జరిగాయి.


ఇక RC16 మొదలవ్వక ముందు నుంచే ఈ చిత్రంలో సంజయ్ దత్ నటిస్తున్నాడు, బాబీ డియోల్ నటిస్తున్నాడు.. అంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటివరకు హీరో హీరోయిన్ తప్ప ఎవరిని మేకర్స్ ఫైనలైజ్ చేయలేదని టాక్. ఈ నేపథ్యంలోనే RC16 కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే.. ఈ సినిమా కోసం బాలీవుడ్ మెగాస్టార్ రంగంలోకి దిగుతున్నాడు అంట.

అవును.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ను RC16 లో తీసుకోవడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ కు తాతగా నటించడానికి అమితాబ్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. ఆయన కనుక ఓకే అంటే.. సినిమాపై అంచనాలు మరింత ఎక్కువ అవుతాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×