Kriti Sanon: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో నటనతో అందరినీ ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ, ఎవరితోనైనా కాస్త చనువుగా ఉంటే చాలు రూమర్స్ సృష్టిస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమాలో సీతగా నటించి ఆకట్టుకుంది. దాంతో ప్రభాస్ తో ఈమె ఎఫైర్ నడుపుతోందంటూ రూమర్స్ క్రియేట్ చేశారు. దీనిపై కరణ్ జోహార్ (Karan Johar) షో లో స్పందించి, అతడు కేవలం స్నేహితుడు మాత్రమే అంటూ కొట్టి పారేసింది కృతి సనన్.
ప్రియుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కృతి..
అయితే తాజాగా ఇప్పుడు ఈమె వ్యాపారవేత్త కబీర్ బహియా (Kabeer Bahia)తో ప్రేమలో ఉన్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. కొంతమంది నమ్మకపోయినా తాజాగా అందరికీ నమ్మకాన్ని కలిగించేలా పోస్ట్లు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. గత కొన్ని రోజులుగా గ్రీస్ కు విహారయాత్రకు వెళ్లిన వీరు, ఇటీవలే తిరిగి వచ్చారు. దీంతో రూమర్స్ చాప కింద నీరులా వ్యాపించాయి. కానీ ఈమె స్పందించలేదు. ఇప్పుడు ఈమె చేసిన ఒక పోస్ట్ వారి మధ్య ప్రేమ ఉందనే వార్తలకు మరింత బలం చేకూర్చింది. తాజాగా కబీర్ బహియా పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. “పుట్టినరోజు శుభాకాంక్షలు కే” అంటూ హార్ట్ ఎమోజిని కూడా పోస్ట్ చేసింది. “ఈ చిరునవ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి” అంటూ కూడా రాసుకొచ్చింది కృతి సనన్. ఈమె సోదరి నుపూర్ సనన్..తన ప్రియుడు స్టెబిన్ బెన్.. కబీర్ కు బర్తడే విషెస్ తెలియజేసి ,ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో కూడా బెన్ తోపాటు కృతి ,కబీర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికైతే ఒక్క పోస్ట్ తో లవ్ కన్ఫర్మ్ చేసేసింది ఈ ముద్దుగుమ్మ అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.
కృతి సనన్ కెరియర్..
భారతీయ నటిగా, మోడల్ గా పేరు దక్కించుకున్న ఈమె, ఎన్నో పెద్ద కంపెనీలలో కమర్షియల్ యాడ్స్ లో నటించి పేరు దక్కించుకుంది. ఇక తెలుగులో మహేష్ బాబు(Mahesh Babu) సరసన ‘1- నేనొక్కడినే’ అనే సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత హిందీలో జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ సరసన ‘హీరోపంతి’ సినిమాతో అరంగేట్రం చేసింది.. ఇక తర్వాత ఆది పురుష్ సినిమాలో కూడా నటించింది. ఇకపోతే 2021లో వచ్చిన మిమి సినిమాలో తన నటనకు అనేక అవార్డులు కూడా అందుకుంది. అందులో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్న ఈమె.. అలియా భట్ (Alia Bhatt)లీడ్ రోల్ పోషించిన గంగూభాయ్ కతియావాడి సినిమాలో ఆమెతోపాటు నటించి ఆమెతోపాటు జాతీయ అవార్డును కూడా అందుకుంది. అంతేకాదు 2019 ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో పేరు దక్కించుకుంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">