Aditi Rao hydari: అదితీ రావు హైదరి(Aditi Rao Hydari)..తెలుగు హీరోయిన్ అయినప్పటికీ బాలీవుడ్ ద్వారా ఫేమస్ అయిన నటి.ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ మూవీతో.. ఆ తర్వాత తమిళంలో కూడా ఓ సినిమా చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంది. అదితి మన తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. సుధీర్ బాబు (Sudheer babu) హీరోగా చేసిన సమ్మోహనం (Sammohanam) సినిమా ద్వారా అదితీ రావు హైదరి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా హిట్ కొట్టడంతో అదితీ రావు హైదరీకి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. అలా సుదీర్ బాబు, నాని (Nani) కాంబినేషన్లో వచ్చిన వి(V), అంతరిక్షం 9000 కేఎంపిహెచ్ వంటి సినిమాల్లో ఆఫర్స్ అందుకుంది.
సినిమాలకు గుడ్ బై చెప్పానుందా..
అయితే సినిమాలకంటే ఎక్కువగా ఈ హీరోయిన్ పెళ్లి ద్వారానే ఫేమస్ అయింది. ఎందుకంటే సౌత్ హీరో అయినటువంటి సిద్ధార్థ్ (Siddharth)ని పెళ్లి చేసుకొని ఈ హీరోయిన్ ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది.నటుడు సిద్ధార్థ్ అదితి రావు హైదరీ ల పెళ్లి సీక్రెట్ గా జరిగింది. వీరి పెళ్లి జరిగిన కొద్ది రోజులకు ఈ విషయాన్ని బయట పెట్టారు.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతుంది అనే టాక్ నెట్టింట్లో వినిపిస్తోంది. మరి నిజంగానే అదితీ రావు హైదరీ సినిమాలకు గుడ్ బై చెబుతుందా.. ? సిద్దార్థ్ సినిమాలు వద్దని చెప్పారా? అనేది ఇప్పుడు చూద్దాం. సిద్ధార్థ్ అదితీ రావు హైదరి(Siddharth- Aditi Rao Hydari) కాంబినేషన్లో ‘మహా సముద్రం’ సినిమా వచ్చింది. ఈ సినిమా షూట్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఈ సినిమాలో నటించాక చాలా రోజులు వీరిద్దరూ జంటగా కనిపించారు. కానీ వారి మధ్య ప్రేమ లేదు అని, జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు.అయితే సమయం దొరికినప్పుడల్లా ఈ జంట వెకేషన్స్ కి వెళ్తూ కెమెరాల కంట చిక్కింది. దాంతో వీరి గురించి సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోయింది. అయితే ఎట్టకేలకు వీరి మధ్య వస్తున్న రూమర్లు నిజమేనని సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చారు.ఆ తర్వాత కొద్ది రోజులకు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లయ్యాక కొద్ది రోజులకి ఈ విషయాన్ని బయటపెట్టిన సిద్ధార్థ్ అదితి (Siddharth-Aditi)లు రెండోసారి కూడా పెళ్లి చేసుకున్నారు.అలా సిద్ధార్థ్ ను పెళ్లి చేసుకోవడం ద్వారా అదితి రావు హైదరి పేరు నెట్టింట్లో మార్మోగిపోయింది. అయితే పెళ్లి తర్వాత అదితి రావు హైదరి సినిమాలకు గుడ్ బై చెప్పి బిజినెస్ చూసుకోబోతుంది అనే రూమర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
రూమర్స్ అన్నీ ఫేక్..
అయితే ఈ రూమర్ నెట్టింట్లో వినిపించడంతో చాలామంది నెటిజన్స్ సిద్ధార్థ్ అదితి ని సినిమాలు మానేయమని చెప్పాడు కావచ్చు అందుకే సినిమాలకు గుడ్ బై చెబుతుంది అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే..అదితి రావు హైదరి సినిమాలకు గుడ్ బై చెప్పడం లేదు.ఆమె సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం అదితి రావు లయనన్స్,గాంధీ టాక్స్ అనే సినిమాలు చేస్తోంది. ఈ సినిమాలు త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఇక అదితి సినిమాలకు గుడ్ బై చెబుతుంది అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఇక సిద్ధార్థ్ అదితి ల పర్సనల్ లైఫ్ కి వస్తే.. వీరిద్దరికీ మొదట పెళ్లిళ్లయ్యి విడాకులు అయ్యాయి. వీరిద్దరికి ఇది రెండో పెళ్లే కావడం గమనార్హం.