BigTV English
Advertisement

Rohit Sharma: ఆటోలో ప్రయాణించిన రోహిత్ శర్మ…!

Rohit Sharma: ఆటోలో ప్రయాణించిన రోహిత్ శర్మ…!

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా టెస్ట్ క్రికెట్ లో పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ { Rohit Sharma} ఇక టెస్ట్ క్రికెట్ లో కనిపించకపోవచ్చు అనే చర్చ మొదలైంది. పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ { border Gavaskar trophy} లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన ఐదవ టెస్ట్ నుండి తప్పుకున్నాడు.


Also Read: Travis Head: ఓపెనర్ గా వచ్చి రెచ్చిపోయిన హెడ్….టెస్టులు కూడా ఇక చూడాల్సిందే !

దీంతో ఈ చివరి టేస్ట్ కి జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించారు. ఆస్ట్రేలియా { Australia} తో ఐదు టెస్టుల సిరీస్ లో మూడు టెస్టులు ఆడిన రోహిత్ శర్మ.. ఐదు ఇన్నింగ్స్ లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. 37 ఏళ్ల రోహిత్ శర్మ { Rohit Sharma} ఈ సిరీస్ లో పేలవ ప్రదర్శన కనబరిచాడు. 2024 సంవత్సరంలో టెస్ట్ క్రికెట్ లో మొత్తం 14 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ.. 26 ఇన్నింగ్స్ లలో 24.76 సగటుతో 619 పరుగులు మాత్రమే చేశాడు.


రోహిత్ శర్మ మాత్రమే కాకుండా ఇతర ఆటగాళ్లు కూడా తీవ్రంగా విఫలం కావడంతో ఇక ఆటగాళ్లంతా రంజీ ట్రోఫీల్లో { Ranji Trophy} పాల్గొనాలని బీసీసీఐ నిబంధన విధించింది. దీంతో ముంబై { Mumbai} – జమ్మూ కాశ్మీర్ { Jammu Kashmir} మధ్య జరిగిన రంజీ మ్యాచ్ లో పాల్గొన్నాడు రోహిత్ శర్మ. ఈ మ్యాచ్ లో కూడా అంతగా రాణించలేకపోయాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్ లలో కలిపి కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.

మొదటి ఇన్నింగ్స్ లో 3, రెండవ ఇన్నింగ్స్ లో 28 పరుగులు చేశాడు. ఇక ముంబై జట్టు తన తదుపరి మ్యాచ్ ని మేఘాలయతో తలపడాల్సి ఉంది. మరోవైపు ఫిబ్రవరి 6 నుండి భారత్ – ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ { ODI series} ప్రారంభం కాబోతోంది. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 { Champions Trophy 2025} కి కూడా సమయం దగ్గర పడింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫిట్నెట్ పై దృష్టి సారించాడు. బరువు తగ్గేందుకు రోహిత్ శర్మ చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లుగా తెలుస్తోంది.

Also Read: Sehwag – Grey Divorce: ‘గ్రే’డివర్స్ అంటే ఏంటీ.. సెహ్వాగ్ తీసుకోబోయేది ఇలాంటి విడాకులేనా?

తాజాగా రోహిత్ శర్మ కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో న్యూ లుక్ లో తలతలా మెరిసిపోతున్నాడు రోహిత్ శర్మ. అంతేకాదు ఈ ఫోటోలో స్లిమ్ గా కనిపిస్తున్నాడు. ఓ ఫోటో షూట్ లో భాగంగా రోహిత్ శర్మ ఆటోలో ప్రయాణించినట్లుగా తెలుస్తోంది. సాధారణ గడ్డం, చిన్నపాటి మీసాలతో ఈ ఫోటోలో యంగ్ గా కనిపిస్తున్నాడు రోహిత్. ఈ న్యూ లుక్ పై { Rohit Sharma new look} అభిమానులతో పాటు క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. హీరోలా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Hong Kong Sixes 2025 : హార్దిక్ పాండ్యాను కాపీ కొట్టిన పాకిస్తాన్..ఛీ.. ఛీ ఎంతకు తెగించార్రా

IPL 2026: SRH జ‌ట్టులో ఫిక్సింగ్..అంబానీతో చేతులు క‌లిపి ద‌గా, కావ్యపాప స్కెచ్ చూడండి !

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్‌, వేదిక‌లు ఇవే…హైద‌రాబాద్, విశాఖ‌కు అన్యాయం ?

Cricket players : ఇప్ప‌టి క్రికెట‌ర్లు ఆ వైట్ క్రీమ్ ను ఎందుకు వాడ‌టం లేదో తెలుసా..?

IPL 2026-SSMB 29 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు చిచ్చులు పెడుతున్న మహేష్-జక్కన్న, వేలం ఎప్పుడంటే?

Hong Kong Sixes 2025 Final: హాంకాంగ్‌ సిక్సెస్ 2025 విజేత‌గా పాకిస్తాన్..6వ సారి ట్రోఫీ, ప్రైజ్ మ‌నీ ఎంతంటే

IPL 2026: సంజు ఎఫెక్ట్‌..జ‌డేజా అకౌంట్ పై బ్యాక్‌, ఐపీఎల్ 2026కు ముందే సంచ‌ల‌నం !

Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ లెస్బియన్ అంటూ ట్రోలింగ్..ఆ ఫోటోలు వైర‌ల్ ?

Big Stories

×