BigTV English

Kalyan Ram : కళ్యాణ్ రామ్ టాటూ వెనుక అంత పెద్ద స్టోరీ ఉందా..?

Kalyan Ram : కళ్యాణ్ రామ్ టాటూ వెనుక అంత పెద్ద స్టోరీ ఉందా..?

Kalyan Ram : టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన గతంలో ఎన్నో సినిమాల్లో నటించాడు. బింబిసార వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. రీసెంట్ గా అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ సూపర్ హిట్ టాక్ ని అందుకుంది. ప్రస్తుతం ఆ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న కళ్యాణ్ రామ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్  ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో ఒకసారి చూసేద్దాం..


నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలు.. 

కళ్యాణ్ రామ్ గతంలో ఒకలెక్క.. ఇప్పుడు మరో లెక్క అన్నట్లు సినిమాలు చేస్తున్నాడు. కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. బింబిసార చిత్రంలో ద్విపాత్రాభినయంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. అమిగోస్ అనే మూవీలో నటించాడు. ఆ మూవీ కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కొత్త కథలతో ప్రేక్షకులను పలకరిస్తున్న కళ్యాణ్ రామ్ రీసెంట్ గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ ఒక వర్గం ప్రేక్షకులను బాగా మెప్పించింది. కానీ కొంతమందికి నచ్చలేదు. మిక్సీ్డ్ టాక్ అందుకుంది.. ఇటీవల ఓ ఇంటర్వ్యూ పాల్గొన్న ఆయన తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో తన చేతి పై ఉన్న టాటూ గురించి కొన్ని ఆసక్తి విషయాలను షేర్ చేశారు..


కళ్యాణ్ రామ్ టాటు వెనుకాల ఇంత స్టోరీ ఉందా..? 

కళ్యాణ్ రామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఎన్నో కీలక విషయాలను పంచుకున్నారు. ఆయన భార్య గురించి మాట్లాడారు. ఆమె గొప్పతనాన్ని వివరించారు. అంతేకాదు తన చేతి పై ఉన్న పచ్చబొట్టు గురించి కూడా తొలిసారి వివరించారు. 2008 మధ్య కాలంలో నేను తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాను. ఆరోగ్యం బాగా చెడిపోయింది. ఆ సమయంలో నా భార్య స్వాతి అన్ని దగ్గరుండి చూసుకుంది. నాకు ఒక తల్లి కన్నా ఎక్కువగా చూసుకొని సేవలు చేసింది. అది నా మనసుకు బాగా తాకింది. నా భార్యపై ఉన్న ప్రేమతోనే తన పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాను. అసలు నేను ఇంజక్షన్ చేయించుకోవాలన్నా భయపడిపోయేవాడిని. కానీ ఆ భయాన్ని ఆమె మీద ఉన్న ప్రేమ అధిగమించేలా చేసింది. అలా ఆమె పేరు నా చేతి మీదకు వచ్చింది.. అలా ఆమె లేకపోతే నేను ఇప్పుడు మీ ముందర ఇలా ఉండేవాన్ని కాదు అంటూ కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఓ ప్రాజెక్టు లో నటిస్తున్నాడు. అలాగే పలు సినిమాలను నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న ఓ మూవీని నిర్మిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×