OTT Movie : దెయ్యాల సినిమాలు ఒక విచిత్రమైన అనుభూతిని ఇస్తాయి. ఈ సినిమాలలో దెయ్యాలు ప్రేక్షకుల్ని భయపెడుతూ ఎంటర్టైన్ చేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ, ఒక కొత్త అపార్ట్మెంట్లో ఉన్న దెయ్యం చుట్టూ తిరుగుతుంది. ఇది ప్రతీకరంతో ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీ లోకి వెళితే
1976 లో స్పెయిన్‌లో ఫ్రాంకో నియంత పాలన ముగిసిన తర్వాత, ఓల్మెడో కుటుంబం ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. ఈ కుటుంబం ఒక గ్రామం నుంచి, మాడ్రిడ్‌లోని మలసానా స్ట్రీట్‌లోని ఒక విశాలమైన పాత అపార్ట్‌మెంట్‌లోకి వలస వస్తారు. ఈ అపార్ట్‌మెంట్ తక్కువ ధరకు రావడంతో, వీళ్ళు దీన్ని కొనుగోలు చేస్తారు. కానీ త్వరలోనే వాళ్ళు ఈ ఇంట్లో ఏదో దుష్ట శక్తి ఉందని తెలుసుకుంటారు. వీళ్ళు అపార్ట్‌మెంట్‌లోకి వచ్చిన వెంటనే, వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి. తలుపులు స్వయంగా తెరుచుకోవడం, లైట్లు ఆన్ ఆఫ్ అవడం, ఫోన్ రింగ్ అవడం వంటివి జరుగుతూ ఈ కుటుంబాన్ని భయపెడుతుంటాయి. ఈ కుటుంబంలో చిన్న పిల్లవాడైన రఫా ఒక రోజు అపార్ట్‌మెంట్‌లో జరిగే భయానక దృశ్యాలను చూస్తాడు. ఆ తరువాత అతను హఠాత్తుగా కనిపించకుండా పోతాడు. దీంతో ఈ కుటుంబం భయాందోళనకు గురవుతుంది.
ఈ అపార్ట్‌మెంట్‌లో క్లారా అనే ఆత్మ ఒకటి ఉంటుంది. ఈ ఆత్మ తన గత జీవితంలో జరిగిన కొన్ని దారుణమైన సంఘటనల వల్ల ప్రతీకారంతో ఉంటుంది. అయితే కొత్తగా వచ్చిన ఈ కుటుంబం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండటం వల్ల ఆ ఇంటిని వదిలి వెళ్ళలేకపోతారు. వాళ్ళు ఈ ఆత్మను శాంతింపజేయడానికి మహిమలు ఉన్న ఒకవ్యక్తి సహాయం తీసుకుంటారు. ఆ ఇంట్లో క్లారా అనే అమ్మాయి ఆత్మ ఉందని ఆ వ్యక్తి తెలుసుకుంటాడు. ఆ ఆత్మతో మాట్లాడి దాని సమస్యను పరిష్కరించాలని అనుకుంటాడు. చివరికి క్లారా ఆ ఇంట్లో ఆత్మగా ఎలా మారింది ? దాని గతం ఏమిటి ? ఈ ఆత్మకి శాంతి లభిస్తుందా ? అదృశ్యం అయిన పిల్లాడు తిరిగి వస్తాడా ? ఈ కుటుంబం ఎటువంటి సమస్యలను ఎదుర్కుంటుంద ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సూపర్ నాచురల్ హారర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : భర్త చనిపోయి, కూతురున్న మహిళపై ఫీలింగ్స్… ఫీల్ గుడ్ మలయాళ మూవీ
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సూపర్ నాచురల్ హారర్ మూవీ పేరు ‘మలసానా స్ట్రీట్ 32’ (Malasana Street 32). 2020 లో విడుదలైన ఈ స్పానిష్ సినిమాకి ఆల్బర్ట్ పింటో దర్శకత్వం వహించారు. 1976 లో మాడ్రిడ్‌లోని మలసానా ప్రాంతంలో జరిగిన కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో బెగోనా వర్గాస్, బీ సెగురా, ఇవాన్ మార్కోస్, సెర్గియో కాస్టెలనోస్, జేవియర్ బోటెట్ తదితరులు నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.