Betting App Case :కాసులకు కక్కుర్తి పడి.. నలుగురికి ఆదర్శంగా నిలవాలి అనే ఆలోచన లేకుండా.. ఫేమ్ ఉంది కదా అని.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి.. యువత ప్రాణాలతో చెలగాటమాడారు కొంతమంది సెలబ్రిటీలు. అందులో భాగంగానే రంగంలోకి దిగిన పోలీసులు ఈ 29 మంది సెలెబ్రిటీలపై కేసు ఫైల్ చేశారు. అంతేకాదు అప్పట్లో విచారణ నిర్వహించినా.. ఎవరూ కూడా సరైన వివరణ ఇవ్వలేకపోయారు. అయితే ఇప్పుడు రంగంలోకి దిగిన ఈడీ అధికారులు వీరికి మళ్ళీ నోటీసులు ఇవ్వడానికి సిద్ధం అయిపోయారు. ఈ దెబ్బకి మొత్తం కక్కేస్తారని తెలుస్తోంది.
మళ్లీ నోటీసులు.. దెబ్బకు కక్కేయడం ఖాయం..
బెట్టింగ్ యాప్ల కోసం ప్రమోషన్ల వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగింది అనే కోణంలోనే ఇప్పుడు ఈడి అధికారులు రంగంలోకి దిగారు. మొత్తం 29 మంది సినీ నటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్ల పై ఈసీఐఆర్ కేస్ నమోదు చేసింది. బెట్టింగ్ నిర్వాహకులతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ కాపీలను ఇవ్వాలని 29 మంది సెలబ్రిటీలకు ఈడి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే యాడ్ ఏజెన్సీలు బెట్టింగ్ యాప్ యజమానులతో పాటు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రానా దగ్గుబాటి(Rana daggubati), మంచు లక్ష్మీ (Manchu Lakshmi), ప్రకాష్ రాజ్ (Prakash Raj), నిధి అగర్వాల్ (Nidhi Agrawal) తో సహా మొత్తం 29 మంది సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసి.. త్వరలోనే విచారించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో చిక్కుకున్న 29 మంది సెలబ్రిటీలు వీరే..
ఈ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసి చిక్కుల్లో పడ్డ సెలబ్రిటీస్ విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, రీతు చౌదరి, శ్రీముఖి, శ్యామల వంటి మొత్తం 29 మంది సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు , యూట్యూబర్స్ ఉన్నారు.
బెట్టింగ్ యాప్ యజమానులపై కేసు ఫైల్..
అలాగే 19 మంది బెట్టింగ్ యాప్ యజమానులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే.. ఏ 23, జంగిల్ రమ్మీ డాట్ కామ్, యోలో 247 ఫెయిర్ ప్లే, తెలుగు 365, జీత్ విన్, వి బుక్, తాజ్ 77, మామ 247, ఎస్ 365 జై 365, తాజ్ 777 బుక్, ఆంధ్ర 365, జెట్ ఎక్స్, పరి మ్యాచ్, ధని బుక్ 365 వంటి బెట్టింగ్ యాప్స్ యజమానులపై కూడా కేసులు నమోదయ్యాయి.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీరే..
విష్ణుప్రియ, నీతూ అగర్వాల్, సిరి హనుమంతు, వర్షిణి, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, నయనీపావని, అమృత చౌదరి, నేహా పఠాన్ , పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, పండు, టేస్టీ తేజ, సన్నీ యాదవ్, బండారు సుప్రీత వంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా ఈడీ ఆఫీసర్స్ కేస్ ఫైల్ చేశారు.
ALSO READ:Samantha: దిక్కుమాలిన ఎఫైర్ అవసరమా.. సమంతపై నెటిజన్స్ ట్రోల్స్!