Gundeninda GudiGantalu Today episode September 12th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లోని వాళ్లు అందరు కూడా మీనా, బాలు పెళ్లి రోజు వేడుకను ఘనంగా జరుపుతారు. ఈ వేడుక అనంతరం అందరూ మీనా బాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటారు. ఒక్కొక్కరు మీనా బాలుల దాంపత్యం గురించి వివరిస్తారు. అయితే అందరూ వీళ్ళ గురించి పాజిటివ్గా చెప్పిన సరే మౌనిక చెప్పిన విషయంపై అనుమానం వస్తుంది. అన్నయ్య వదినలు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి వీళ్ళ జీవితం మాలాగే ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని అనగానే అందరికీ అనుమానం వస్తుంది. అన్నయ్య వదినలు ఎంతో సంతోషంగా ఉంటున్నారు కదా.. వాళ్ళలాగే మేము కూడా ఎప్పుడూ గొడవలు పడకుండా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నామని మౌనిక అంటుంది. సత్యం కూడా బాలు మీనాల గురించి గొప్పగా మాట్లాడుతాడు.. ఇంట్లో వాళ్లంతా సంతోషంగా ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పెళ్లి రోజు నాడు బాలు, మీనా ఇద్దరు గదిలో లేకుండా ఎలా అని సుశీల ఆలోచిస్తూ ఉంటుంది. కొత్తగా పెళ్లైన వాళ్లకి గది లేకుండా ఉంటే ఎలా ఉంటుంది ఇంకొక గది పైన వేపించమని చెప్పాము కదా మరి నువ్వు ఎందుకురా ఇంకా వేపించలేదు అని సుశీల అడుగుతుంది. ఆ మాట వినగానే సత్యం నేను కూడా చూస్తున్నాను అమ్మ.. కొత్తగా గది వేపించడానికి ప్రయత్నం చేస్తున్నాను అని అంటాడు.
ఇకపోతే సుశీల వాళ్లు వీళ్లు డబ్బులు ఇస్తే వేపించడం కాదురా మనమే వేపించుకోవాలి.. మన ఇంటి కోసం వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే చులకనగా అయిపోతాము అని సుశీల అంటుంది. ఆ మాట వినగానే ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుశీల మాత్రం ఎవరేమనుకున్నా సరే రా మనం మాత్రం గదిని వేపించాలి అని అంటుంది. రోహిణి పక్కకొచ్చి మాట్లాడుతూ ఉంటుంది.. అక్కడికొచ్చిన ప్రభావతి రోహిణిని ఇంట్లో ఫంక్షన్ బాగా జరిగింది కదా అమ్మ అని అడుగుతుంది.
శృతి వాళ్ళ అమ్మ వచ్చింది, మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వీళ్ళిద్దరూ వెళ్లి వచ్చారు ఎప్పుడు ఏం జరిగినా అందరూ సంతోషంగా ఉన్నారు కానీ నువ్వు మాత్రం మీ ఇంట్లో వాళ్ళని ఎవరిని తీసుకురాలేదు అని ఎత్తి పొడుస్తుంది ప్రభావతి.. అలాగే మీ నాన్న నీ సారి కచ్చితంగా తీసుకురావాలి అని కండిషన్ పెడుతుంది. ఆ తర్వాత రోహిణి వాళ్ళ అమ్మ పార్వతికి ఫోన్ చేసి ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి చెప్తుంది. నేను వచ్చే వారం వస్తానమ్మా అని రోహిణి అంటుంది. కూతురి ఇంటికి వస్తానంటే నేను ఎందుకు వద్దంటానమ్మా అని ఆమె అంటుంది..
నాకు చింటూ గాడు బాగా గుర్తొస్తున్నాడు అమ్మ ఒకసారి చూడాలనిపిస్తుంది వాడిని అని రోహిణి అంటుంది. నీ బిడ్డను చూడటానికి నువ్వు వస్తానంటే నేనెందుకు వద్దంటానమ్మా నువ్వు రావడమే కావాలి అని పార్వతమ్మ అంటుంది. సరే అమ్మ మనోజ్ వస్తున్నాడు నేను ఉంటాను అని రోహిణి అంటుంది. నేను బయటికి వెళ్లి వస్తాను అని రోహిణి చెప్పి వెళ్ళిపోతాడు. అయితే ప్రభావతి మాత్రం వీళ్ళకి గది లేకపోతే ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటో అని బయటికి వచ్చి మరి ఆలోచిస్తూ ఉంటుంది.. ఇప్పుడు వీళ్లు గది తీసుకొని అక్కడ కాపురం పెట్టి పిల్లల్ని జనాల ఏంటో మా అత్తయ్య గారి చాదస్తం రోజురోజుకి ఎక్కువ అయిపోతుంది అని ఉంటుంది.
Also Read : ప్రేమ మాటతో ఫ్యూజులు అవుట్.. ధీరజ్ కాపురంలో చిచ్చు.. చందుకు శాశ్వతంగా వల్లి దూరం..?
సుశీల మాత్రం పైకింది తన మనవడు మనవరాలు తో కలిసి పడుకుంటుంది. మాకు గది లేదని ఏ రోజు బాధపడలేదు మమ్మల్ని ఇంట్లో మనుషులుగా గుర్తిస్తే చాలు అని అనుకుంటున్నామని బాలు అనగానే సుశీల ఫీలవుతుంది.. ఇక ఉదయం లేవగానే సుశీల నేను వచ్చిన పని అయిపోయింది ఇక వెళ్ళిపోతాను అని అంటుంది.. కానీ సత్యం ఇంకొన్ని రోజులు ఆగమ్మా అని అడుగుతాడు.. నేను ఇక్కడే ఉంటే మీ ఆవిడ చాలా ఫీల్ అయిపోతుంది లేరా అని అంటుంది. అయ్యో అత్తయ్య గారు నాకు ఎటువంటి సమస్య లేదండి మీరు నా మీద వేస్తున్నారేంటి అని అడుగుతుంది ప్రభావతి. అందరూ సరదాగా ఉంటారు. ఇక సుశీల వెళ్లిపోయిన తర్వాత బాలు సుశీల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..