Nindu Noorella Saavasam Serial Today Episode: అంజలి కోసం బ్లడ్ బ్యాంక్ నుంచి రాథోడ్ బ్లడ్ తీసుకొస్తుంటే.. రణవీర్ తన మనుషులను పంపించి బ్లడ్ కింద పోయేలా చేస్తాడు. దీంతో రాథోడ్ బాధపడతాడు. దూరం నుంచి కారులో కూర్చుని రణవీర్ హ్యాపీగా ఫీలవుతాడు. అయ్యో రక్తం అంతా నేల పాలు అయిపోయిందే అంటూ రాథోడ్ బాధపడుతుంటే.. ఇంతలో అమర్ వస్తాడు రాథోడ్ ఏమైంది..? అసలు ఏం జరిగింది.. బ్లడ్ ప్యాకెట్ కింద పడిపోయిందేంటి..? అని అడగ్గానే.. రాథోడ్ ఏడుస్తూ సారీ సార్ నేన బ్లడ్ తీసుకుని వస్తుంటే ఎవడో ఒకడు వచ్చి డాష్ ఇచ్చాడు. బ్లడ్ కిందపడిపోయింది. నేను కావాలని చేయలేదు.. నన్ను క్షమించండి సార్ అంటూ బాధపడుతుంటే.. ఇట్స్ ఓకే రాథోడ్ ఇలా జరిగితే నువ్వు మాత్రం ఏం చేస్తావు.. అంటూ చెప్తుండగానే.. అక్కడికి మిస్సమ్మ, పిల్లలు, రామ్మూర్తి వస్తారు. బ్లడ్ దొరికింది కదా..? అంజలికి సర్జరీ అవుతుంది అనుకున్నాం.. ఇప్పుడెలా డాడీ అంటూ అమ్ము బాధపడుతుంది.
రాథోడ్ మీరు ఆ బ్లడ్ ప్యాకెట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని మిస్సమ్మ అడగ్గానే.. ఒక హాస్పిటల్ లో తీసుకొచ్చాను మిస్సమ్మ అక్కడ ఉన్న ఒక్క బ్లడ్ ప్యాకెట్ నాకే ఇచ్చారు అని రాథోడ్ చెప్పగానే.. మిస్సమ్మ బాధపడుతుంది. వెంటనే అమర్‌ను పక్కకు తీసుకెళ్లి.. ఏవండి రణవీర్.. అంజు తండ్రి అని మనకు తెలుసు కదా..? రణవీర్ బ్లడ్ అంజుకు సరిపోతుందేమో చూస్తే.. అని చెప్తుంది. రణవీర్ బ్లడ్ ఎందుకు ఇస్తాడు. పైగా మనం అలా చేస్తే రణవీర్‌కు అంజు తన కూతురు అన్న విషయం తెలిసిపోతుంది కదా..? అంటాడు అమర్.. రణవీర్‌కు తెలియకుండా ఎలాగైనా బ్లడ్ తీసుకునే ప్రయత్నం చేయండి అని మిస్సమ్మ చెప్పగానే.. సరే నా ప్రయత్నం నేను చేస్తాను అంటూ అమర్ వెళ్లిపోతాడు.
తర్వాత అమర్ తన మనషులను పంపించి రణవీర్ లాయరును కిడ్నాప్ చేయించాలనుకుంటాడు. అలాగే లాయరు దగ్గరకు తన మనుషులను పంపిస్తాడు. లాయరు ఒక దగ్గర రోడ్డు పక్కన టీ తాగుతుంటాడు. అమర్ కూడా లాయరును ఫాలో అవుతుంటాడు. లాయరు కోసం కారు పక్కన ఆపమంటాడు అమర్. రాథోడ్ కారును పక్కన ఆపేసి ఎందుకు సార్ ఇక్కడ ఆపమన్నారు.. ఇక్కడ మనకేంటి పని..? అని అడుగుతాడు. అక్కడ చూడు రణవీర్ లాయరు ఉన్నాడు. వాడిని పట్టుకుంటే.. రణవీర్ భార్య ఎవరో తెలుస్తుంది అని చెప్తాడు. లాయరు దగ్గరకు అమర్ మనుషులు వెళ్లి మాట్లాడతారు. మీరు లాయరు కదా..? మాకు ఒక కేసు వాదించాలి మీరు ఫీజు ఎంత తీసుకుంటారు అని అడగ్గానే.. నేను బయటి కేసులు వాదించను అయినా నా గురించి మీకు ఎవరు చెప్పారు అని లాయరు అడుగుతుండగానే అమర్ మనుషులు లాయరును బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని వెళ్తారు.
ఒక సీక్రెట్ ప్లేస్‌కు లాయరును తీసుకెళ్లి ఇంటరాగేషన్ చేస్తుంటారు. లాయరు భయంతో ఎవరు మీరు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు. నేను ఒక లాయరు అన్న విషయం మీరు మర్చిపోతున్నారు.. నేను బయటికి వెళితే మీరు లీగల్ గా కేసులు ఎదుర్కోవలసి ఉంటుంది అంటూ భయంతో భయపెట్టాలని చూస్తాడు. కానీ అమర్ మనుషులు కూల్ గా కంగారు పడకు నువ్వు సేఫ్ గానే ఉన్నావు.. మాకు కావాల్సిన ఇన్మఫర్మేషన్ ఇస్తే అంతే సేఫ్‌గా నువ్వు ఇంటికి వెళ్తావు అని చెప్తారు. దీంతో లాయరు మరింత కంగారు పడుతూ అసలు మీరెవరు..? మీకు నాతో ఏం పని ఉంది.. నేను ఏం సమాచారం ఇవ్వాలి మీకు అని అడుగుతాడు లాయరు.. ఒక చిన్న సమాచారం కావాలి అది నీకే తెలిసిందే.. నువ్వు కోల్‌కతా నుంచి వచ్చిన రణవీర్ దగ్గర పని చేస్తావు కదా..? అని అమర్ మనుషులు అడగ్గానే.. అవును నేను రణవీర్ కు పర్సనల్ లాయరును.. అయినా ఎందుకు అడుగుతున్నారు.. ? అసలు మీరు ఎవరు..? నాతో మీకు ఏం ఇన్మఫర్మేషన్ ఉంది అంటూ లాయరు కంగారుగా అడుగుతుంటాడు.
ఏం లేదు.. రణవీర్ వైఫ్ ఎవరో చెప్పు.. నిన్ను వదిలేస్తాం అని అమర్ మనుషులు అడగ్గానే.. అతని వైప్ ఎవరో నాకు తెలియదు.. అయినా ఆ విషయం మీకు ఎందుకు చెప్పాలి.. అసలు మీరెవరో చెప్పకుండా ఏం చేస్తున్నారు మీరు.. అంటూ లాయరు ప్రశ్నించడంతో అమర్ మనుషులు లాయరును కొట్టి బెదిరిస్తారు. రణవీర్ వైఫ్ ఎవరో చెప్పకపోతే నిన్ను చంపేస్తాం.. అసలు నీ శవం కూడా ఎవ్వరికీ దొరకుండా చేస్తాం.. ఓన్లీ మేము అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చెప్పు అంటూ వార్నింగ్ ఇస్తూ కొడుతుంటారు.. వాళ్ల దెబ్బలకు తట్టుకోలేక లాయరు నిజం చెప్తాడు.. అక్కడ జరుగుతుంన్న ఇంటరాగేషన్ మొత్తం తన కారులో కూర్చుని లైవ్ చూస్తుంటాడు అమర్. లాయరు మాటలు విని షాక్ అవుతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.