Sanjay Dutt: బాహుబలి(Bahubali) సినిమా తర్వాత తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సౌత్ సినిమాలలో నటించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్(Sanjay Dutt) ఇటీవల కాలంలో సౌత్ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కేజీఎఫ్(KGF) సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన త్వరలోనే ప్రభాస్ ది రాజా సాబ్ (The Raja Saab)సినిమా ద్వార ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే త్వరలోనే సంజయ్ దత్ నటించిన “కేడి ది డెవిల్” (KD The Devil)అనే కన్నడ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో నటించారు. తాజాగా చిత్ర బృందం ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ లో టీజర్ విడుదల చేశారు.
బాలీవుడ్ లో ప్యాషన్ లేదు..
టీజర్ లాంచ్ అనంతరం ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ దత్ సౌత్ సినిమాల గురించి అలాగే బాలీవుడ్ సినిమాల(Bollywood Movies) గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సంజయ్ దత్ కు రిపోర్టర్స్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. మీరు ఎక్కువగా దక్షిణాది సినిమాలలో నటిస్తున్నారు. ఈ ఇండస్ట్రీ నుంచి మీరు బాలీవుడ్ కు తీసుకెళ్లాలంటే ఏ విషయాలను తీసుకెళ్తారనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు సంజయ్ దత్త సమాధానం చెబుతూ..”మంచి సినిమాలు చేయాలని ప్యాషన్ బాలీవుడ్ ఇండస్ట్రీకి తీసుకెళ్తానని” తెలిపారు.
ఎంతసేపు కలెక్షన్ల పైనే ఫోకస్..
గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేవి కానీ ఇటీవల కాలంలో మా వాళ్ళ కథపై ఫోకస్ చేయటం మానేసారని, ఎంతసేపు సినిమా కలెక్షన్లు, నెంబర్ల పైనే మా వాళ్ళు దృష్టి పెడుతున్నారు అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి సంజయ్ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి. కానీ సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటివి లేవు వారు ఒక ప్యాషన్ తో సినిమాని చేస్తున్నారని, అందుకే నాకు సౌత్ సినిమాలలో పని చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.
సత్తా చాటుతున్న సౌత్ సినిమాలు..
ఇలా సౌత్ సినిమాలలో ఒక ప్యాషన్ ఉంది కాబట్టే నేను బాలీవుడ్ ఇండస్ట్రీకి ప్యాషన్ తీసుకెళ్తానని తెలియజేశారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి సంజయ్ దత్ చేసిన ఈ కామెంట్స్ చేస్తూ బాలీవుడ్ పరువు గంగలో కలిపారని చెప్పాలి. ప్రస్తుతం ఈయన సౌత్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే నాకు సౌత్ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు , నిర్మాతలు కూడా తెలుసని ఈయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ అని మాత్రమే చెప్పుకునేవారు. కానీ ఇటీవల కాలంలో ఇండియన్ ఇండస్ట్రీని సౌత్ సినిమాలు శాసిస్తున్నాయని చెప్పాలి.. ఈ క్రమంలోనే ఎంతోమంది బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా సౌత్ సినిమాలలో నటించడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.
Also Read: Actors Dual role: ఇండస్ట్రీలో మళ్లీ డూయల్ రోల్స్ హవా… ఎంత మంది హీరోలు చేస్తున్నారంటే ?