Viral Video: తరచూ రైలుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఏదో ఒక విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే వందేభారత్ రైళ్లపై రాళ్ల దాడులు జరిగిన ఘటనలు చాలానే సోషల్ మీడియాలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. అయితే చాలా వరకు ఇలాంటి ఘటనలు వందేభారత్ పై జరగ్గా.. తాజాగా ఓ రైలుపై రాళ్ల దాడి ఘటన జరిగింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైలుపై ఓ యువకుడు దాడి చేయడంతో ప్రయాణికుడికి తీవ్ర గాయమైంది.
ఈ ఘటన దర్భంగా, కాకర్ ఘాటి మధ్య వెలుగుచూసింది. ప్రస్తుతం దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఓ యువకుడు రైలుపై రాళ్ల దాడి చేయాలని ప్రయత్నించాడు. ఈ తరుణంలో రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి తీవ్ర గాయమైంది. ప్రయాణికుడి ముక్కుపై గాయమైనట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఇది బీహార్ లోని భాగల్ పూర్, జైనగర్ ఎక్స్ ప్రెస్ రైలుపై జరిగింది. రాయి విసిరిన వ్యక్తి ఫోటోలు, వీడియోలను రైలులో ప్రయాణిస్తున్న కొంతమంది తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రాళ్ల దాడి కారణంగా ప్రయాణికుడి ముక్కుపై తీవ్ర గాయమైంది. పోలీసులు ఈ ఘటన వివరాలు తెలుసుకుని నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, గాయాలపాలైన ప్రయాణికుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రైల్వే మంత్రి కూడా స్పందించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశించారు.
भागलपुर जयनगर इंटरसिटी एक्स. पर दरभंगा से काकरघाटी के बीच पथराव किया गया, जिस पर @spjdivn महोदय द्वारा त्वरित कार्यवाही करते हुए पत्थरबाज की गिरफ्तारी की गई। रेल प्रशासन से आग्रह है कि दोषी के खिलाफ कठोरतम कार्यवाही की जाय ताकि ऐसी घटना की पुनरावृत्ति न हो।@ECRlyHJP @GM_ECRly pic.twitter.com/1ODdRkUK9n
— Supaul Voice | सुपौल वॉइस (@SupaulVoice) August 3, 2024