8 Years For Bahubali 2 : : కొన్ని కథలు పేపర్ మీద చూడడానికి బాగుంటాయి. అలానే కొన్ని వినడానికి కూడా బాగానే ఉంటాయి. కొన్ని ఊహించడానికి ఇంకా బాగుంటాయి. కానీ అదే కదలని వెండితెరపై ఆవిష్కరించాలి అంటే అది సాధారణమైన విషయం కాదు. దాని వెనక ఎంతో కృషి, శ్రమ, పట్టుదల ఉండాలి. ఊహించడమే కష్టం అనుకున్న కొన్ని కథలను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది దర్శకులు. ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి విషయానికి వస్తే బాహుబలి సినిమా తెలుగు సినిమా పరిశ్రమకు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిన విషయమే.
తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది
నత్త నడకలా సాగుతున్న తెలుగు సినిమా మార్కెట్ ను ఒక్కసారిగా షేక్ చేశాడు ఎస్ ఎస్ రాజమౌళి. మొదటి ఈ సినిమాను నిర్మిస్తున్నప్పుడు దాదాపు 200 కోట్లు బడ్జెట్ అంటున్నారు. ప్రభాస్ కి అంత మార్కెట్ లేదు కదా అని అందరూ అప్పట్లో చర్చించుకోవడం మొదలుపెట్టారు. కానీ ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లిన విధానం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. వాస్తవానికి ఈ సినిమాకి మొదట ఇక్కడ నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ బాలీవుడ్ లో ఈ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ కూడా సినిమా పెద్ద హిట్ అయిపోయింది.
ట్విస్ట్ పార్ట్ వన్ ఎండింగ్
బాహుబలి సినిమా విషయానికొస్తే స్టార్టింగ్ నుంచి ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఒక అద్భుతమైన ట్విస్ట్ తో సినిమాని ఎండ్ చేశారు. ఇక ఆ ట్విస్ట్ క్యూరియాసిటీని పార్ట్ 2 వచ్చినంత వరకు ఎదురు చూసేలా ఆసక్తిని పెంచారు. సరిగ్గా పార్ట్ 2, 8 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు నుంచే అద్భుతమైన టాక్ సొంతం చేసుకొని దాదాపు కొన్ని కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటికీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బాహుబలి రికార్డ్ అని కొంతవరకు సాగుతూ వచ్చింది. చాలామంది కొన్ని సినిమా పోస్టల్ పై నాన్ బాహుబలి రికార్డ్స్ అంటూ వేసుకోవడం మొదలుపెట్టారు.
ప్రభాస్ రేంజ్ మారింది
ఇక ఈ సినిమా విషయానికి వస్తే ప్రభాస్ 5 సంవత్సరాలు పాటు కష్టపడ్డాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలైంది. ఇప్పుడు ప్రభాస్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే నటుడు అని చెప్పాలి. ప్రభాస్ తో సినిమా చేస్తే ఖచ్చితంగా మొదటి రోజే 150 కోట్ల వరకు కలెక్షన్స్ వసూలు అవుతాయి. రాజమౌళికి కెరియర్, ప్రభాస్ కు కెరియర్ పక్కన పెడితే తెలుగు సినిమాకి మంచి కెరియర్ వచ్చింది ఈ సినిమా ద్వారా. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా తెలుగు సినిమా వైపు చూడడం మొదలు పెట్టింది ఇక్కడినుంచి. నేటికీ ఇండియన్ సినిమా సత్తా ఏంటో ప్రపంచ వ్యాప్తంగా తెలిసి 8 ఏళ్లు అయింది.
Also Read : Maha Baratham: రాజమౌళి తీయబోయే మహాభారతంలో ఆ ముగ్గురు హీరోలు, పర్ఫెక్ట్ ప్లానింగ్ జక్కన్న