Tirumala Updates: విద్యార్థులకు వేసవి సెలవులు వచ్చాయి. ఇన్ని రోజులు పుస్తకాలతో కుస్తీ పట్టి బుర్ర హీటెక్కిన పిల్లలు కాస్త రిలాక్స్ అయ్యేలా తల్లిదండ్రులు ప్లాన్ చేస్తున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం హిల్ స్టేషన్స్ ను చుట్టి రావడంతో పాటు ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శనకు తీసుకెళ్తున్నారు. ఇక సమ్మర్ అనగానే ఎక్కువ మంది తిరుమలకు వెళ్తుంటారు. కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. సమ్మర్ రద్దీ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
వేసవిలో తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఏడాదంతా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. వేసవి సెలవులు కావడంతో ఆ సంఖ్య మరింత పెరుగులుంది. నిత్యం 70 నుంచి 80 వేల వరకు ఉండే భక్తులు, వేసవి సెలవుల సమయంలో సుమారు లక్ష వరకు చేరుకుంటారు. ఇప్పటికే వేసవి సెలవులు ప్రారంభం కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోవింద నామస్మరణతో తిరుమల మార్మోగుతోంది.
సామాన్యులకు పెద్దపీట
వేసవి రద్దీ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు చేపట్టింది. శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలను కుదించి, ఆ సమయంలో సామాన్య భక్తులను అనుమతించాలని నిర్ణయించింది. తాజాగా జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో ఛైర్మన్ బిఆర్ నాయుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సమ్మర్ హాలీడేస్ లో శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకూడదని ఈ చర్యలు చేపట్టింది.
మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలలో మార్పులు
టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయం ప్రకారం మే 1 వీఐపీబ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు చేయనుంది. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం అయ్యే ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాన్ని పరిమితం చేశారు. ఈ నిర్ణయంతో సామాన్య భక్తులకు ఎక్కువ సమయాన్ని కేటాయించే అవకాశం ఉంటుంది. మే 1 నుంచి జూలై 15 వరకు ఈ నిర్ణయాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులు
వేసవి సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనంలో సామాన్య భక్తులకు టీటీడీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం పట్ల సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మే 15 వరకే కాదు, ఆ తర్వాత కూడా ఇదే పద్దతిని కొనసాగించాలని కోరుతున్నారు. వీఐపీ దర్శనాల పేరుతో సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందని, ఇకపై ఆ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సో, టీడీడీ కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మీరు కూడా మే 1 నుంచి 15 వరకు దర్శనం చేసుకునేలా ప్లాన్ చేసుకోండి. వీఐపీ దర్శనాల ఇబ్బంది లేకుండా త్వరగా శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది.
Read Also: చంటి పిల్లలతో తిరుమలకు వెళ్తున్నారా? గంటలో దర్శనం చేసుకోవచ్చు, ఎలాగంటే?