Maha Bharatam: ప్రతి దర్శకుడికి కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉండటం సర్వసాధారణం. కొంతమంది దర్శకులు వాళ్ళు చేయబోయే డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమాలను తెరకెక్కించడానికి చాలా టైం తీసుకుంటారు. వాళ్లు ఆ డ్రీమ్ ప్రాజెక్టుకి సరైన న్యాయం చేయగలము అని తెలిసినప్పుడే ఆ ప్రాజెక్టుతో పనిలో దిగుతారు. ఇక దర్శకు ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళికి కూడా ఒక డ్రీం ప్రాజెక్టు ఉన్న సంగతి ఎప్పటినుంచో వింటూనే వస్తున్నాం. అదే ఎస్ ఎస్ రాజమౌళి మహాభారతం. అలానే మహాభారతాన్ని ఎస్ఎస్ రాజమౌళి ప్రేక్షకులకు ఎలా చూపిస్తారో అనే క్యూరియాసిటీ కూడా ఉంది. ఎస్ఎస్ రాజమౌళి పలు సందర్భాలలో నా మైండ్ లో ఉన్న మహాభారతాన్ని యాజ్ టీజ్ గా చూపించగలిగితే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. రాజమౌళి టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ ఎంత ఊహించుకొని సినిమాకి వచ్చినా కూడా దానిని మించిన ఎక్స్పీరియన్స్ అందిస్తుంటాడు. ఇప్పటివరకు రాజమౌళి కెరియర్ లో ఒక్క ఫెయిల్యూర్ సినిమా కూడా లేదు అంటేనే అదే గొప్ప విషయం.
మహాభారతం కోసం పెద్దపెద్ద నటులు
ఎస్ ఎస్ రాజమౌళి తన కెరియర్లో చాలామంది హీరోలతో రిపీటెడ్ గా పనిచేశారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ ముగ్గురు హీరోలకి కూడా ఎస్.ఎస్ రాజమౌళి స్టార్డం తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. మీరు కాంబినేషన్లో నాలుగు సినిమాలు వచ్చాయి. సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కిస్తే దాంట్లో కృష్ణుడి పాత్రను ఎన్టీఆర్ చేస్తారు అని ఎప్పటినుంచో వినిపిస్తున్న సమాచారం. అలానే ఎన్టీఆర్ కు కూడా తనను రాజమౌళి ఎలా చూపిస్తాడు అనే క్యూరియాసిటీ ఉంది. ఇక దీనిలో ప్రభాస్ కర్ణుడు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇదివరకే కల్కి సినిమాలో కర్ణుడు పాత్రలో ప్రభాస్ కనిపించాడు. అలానే హీరో నాని కూడా మహాభారతంలో భాగం కాబోతున్నట్లు రీసెంట్ గానే క్లారిటీ ఇచ్చాడు జక్కన్న.
ఐదు సంవత్సరాల తర్వాతే
ఇకపోతే ఎస్ఎస్ రాజమౌళి విషయానికి వస్తే చెప్పిన టైంకి ఎప్పుడు సినిమా రిలీజ్ కాదు. ఒక సినిమాకి ఒక సంవత్సరం పడుతుంది అంటే అది మినిమం టు ఇయర్స్ కి వెళ్ళిపోతుంది. త్రిబుల్ ఆర్ విషయంలో కూడా ఇదే జరిగింది. అయితే లేటుగా వచ్చినా కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటాడు కాబట్టి ఆ విషయంలో రాజమౌళిని అభిమానులు క్షమించేస్తారు. ఇక ప్రస్తుతం ఎస్.ఎస్ రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న సినిమా మినిమం రెండు సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత మిగతా హీరోలు డేట్ లన్ని కుదిరి మహాభారతం చేసి అది ప్రేక్షకుల ముందుకు రావాలి అని అంటే ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు పడుతుంది అని చెప్పాలి.
Also Read : Muthayya Trailer: ముత్తయ్య ట్రైలర్ రిలీజ్, జక్కన్న రియాక్షన్